Asianet News TeluguAsianet News Telugu

ఉద్యోగులకు దీపావళి కానుక.. కార్లు, ఫ్లాట్స్

తాజాగా దీపావళి పండుగ సమీపిస్తున్న వేళ సుమారు 5 వేల మంది ఉద్యోగులకు బోనస్‌ ప్రకటించారు. వారిలో 1600 మంది డైమండ్‌ పాలిష్‌ నిపుణులను ఎంపిక చేసి కార్లు, ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు, ఫ్లాట్లు బహుమతిగా ఇచ్చారు.

Surat Diamond Merchant gifts 600 cars and 900 FD to his employees as Diwali gift
Author
Hyderabad, First Published Oct 25, 2018, 12:14 PM IST

దసరా, దీపావళి పండగలకు.. చాలా కంపెనీలు.. తమ సంస్థలో పనిచేసే ఉద్యోగులకు బోనస్ లు ఇవ్వడం సహజం. వారివారి పనిని బట్టి.. బోనస్ లు ఇస్తారు. ఆ బోనస్ మహా అయితే.. రూ.20వేలు, రూ.30వేలు ఉంటుంది. అయితే.. ఓ యజమాని మాత్రం తమ సంస్థలో పనిచేసే ఉద్యోగులకు ఏకంగా కార్లు, ఫాట్లు బహుమతిగా ఇచ్చాడు. ఆయనే 
సూరత్  కి చెందిన వజ్రాల వ్యాపారి హరికృష్ణ డైమండ్స్ ఎక్స్‌పోర్ట్స్‌ అధినేత సావ్జి దోలకియా.

తమ సంస్థలో పనిచేసే ఉద్యోగులకు ప్రతి ఏటా ఖరీదైన బహుమతులు ఇస్తూ వార్తల్లో నిలుస్తూ ఉంటారు ఆయన. ఇళ్లు, కార్లు, వజ్రాలు, ఆభరణాలు వంటి విలువైన గిఫ్ట్‌లతో ఉద్యోగులను ఆశ్చర్యంలో ముంచెత్తడం ఆయనకు అలవాటు. ఇటీవల తన కంపెనీలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న ముగ్గురు ఉద్యోగులకు రూ. 3 కోట్ల విలువైన బెంజ్‌ కార్లు బహుమతిగా ఇచ్చి వారి శ్రమకు తగిన గుర్తింపునిచ్చారు. 

తాజాగా దీపావళి పండుగ సమీపిస్తున్న వేళ సుమారు 5 వేల మంది ఉద్యోగులకు బోనస్‌ ప్రకటించారు. వారిలో 1600 మంది డైమండ్‌ పాలిష్‌ నిపుణులను ఎంపిక చేసి కార్లు, ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు, ఫ్లాట్లు బహుమతిగా ఇచ్చారు. అంతేకాదు ఈ మూడింటిలో ఏది కావాలో నిర్ణయించుకునే అవకాశం కూడా వారికే ఇవ్వడం విశేషం. ఇలా వారి కోరిక మేరకే 600 మందికి కార్లను, మిగతా వారి పేరిట ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు, ఫ్లాట్లు రాసిచ్చారు సావ్జీ దోలకియా.

ఈ జాబితాలో ఉన్న ఇద్దరు మహిళా ఉద్యోగులకు ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా గురువారం కార్ల తాళం చెవులను అందజేశారు కూడా. అయితే గతంతో పోలిస్తే ఈ ఏడాది దోలకియా ఇచ్చిన బహుమతుల విలువ కాస్త తక్కువే. కాగా 1977లో కేవలం రూ.12.5 బస్సు టిక్కెట్‌ పైసలతో సూరత్‌ చేరుకున్న దోలకియా.. అంచెలంచెలుగా ఎదిగి వజ్రాల వ్యాపారిగా ప్రస్తుతం రూ.6000 కోట్ల టర్నోవర్‌ సాధించారు.

Follow Us:
Download App:
  • android
  • ios