స్వలింగ సంపర్కం నేరమా..? కాదా..? సుప్రీం కీలక తీర్పు నేడే

First Published 6, Sep 2018, 7:25 AM IST
supreme court verdict on section 377
Highlights

స్వలింగ సంపర్కాన్ని నేరమా కాదా అన్న దానిపై సుప్రీంకోర్టు ఇవాళ కీలక తీర్పును ఇవాళ వెలువరించనుంది.

స్వలింగ సంపర్కాన్ని నేరమా కాదా అన్న దానిపై సుప్రీంకోర్టు ఇవాళ కీలక తీర్పును ఇవాళ వెలువరించనుంది. స్వలింగ సంపర్కాన్ని నేరంగా పేర్కొంటున్న భారతీయ శిక్షా స్మృతి(ఐపీసీ)లోని సెక్షన్ 377ను రద్దు చేయడం ద్వారా ఎల్జిబీటీ( లెస్బియన్ గే బై సెక్సువల్ ట్రాన్స్ ‌జెండర్)హక్కులను కాపాడాలని పలువురు సుప్రీంకోర్టులో విడివిడిగా దాఖలు చేసిన పిటిషన్లపై న్యాయస్థానం విచారణకు స్వీకరించింది.

సుధీర్ఘ విచారణ అనంతరం సుప్రీంకోర్టు ఇవాళ తుది తీర్పును వెల్లడించనుంది. కాగా స్వలింగ సంపర్కంపై భారత్‌లో బ్రిటీష్ కాలం నుంచి నిషేధం కొనసాగుతోంది. 

loader