బాణాసంచా విక్రయాలపై సుప్రీంకోర్టు సంచలన తీర్పును వెలువరించింది. టపాసుల అమ్మకాన్ని నియంత్రించాలని.. కేవలం లైసెన్స్ ఉన్న వ్యాపారులు మాత్రమే బాణాసంచా విక్రయాలను నిర్వహించాలని సుప్రీం ఆదేశించింది.. అలాగే బాణాసంచాపై నిషేధం విధించేందుకు ధర్మాసనం నిరాకరించింది.. దేశంలో విచ్చలవిడిగా జరుగుతున్న ఆన్‌లైన్‌ బాణాసంచా విక్రయాలను నిషేధిస్తున్నట్లుగా ప్రకటించింది.

దేశవ్యాప్తంగా బాణాసంచా వినియోగంపై నిషేధం విధించాలంటూ వేసిన పిటిషన్‌పై ఆగస్టు 28న జస్టిస్ సిక్రీ, అశోక్ భూషణ్ నేతృత్వంలోని ధర్మాసనం తీర్పును రిజర్వులో ఉంచింది. అదే సమయంలో బాణాసంచా తయారితో ఉపాధి పొందుతున్న వారితో పాటు భారతీయుల ఆరోగ్యాన్ని కూడా పరిగణనలోకి తీసుకుంటామని సుప్రీం వెల్లడించింది.