న్యూఢిల్లీ: ఇష్టపూర్వక శృంగారాన్ని నేరంగా పరిగణించడం రాజ్యాంగబద్దం కాదని సుప్రీంకోర్టు గురువారం నాడు సంచలన తీర్పు ఇచ్చింది.  ఐపీసీ 497 పురాతన చట్టమని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.

ఈ చట్టం రాజ్యాంగ సమ్మతమైంది కాదని సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ దీపక్‌మిశ్రాతో కూడిన ఐదుగురు సభ్యుల ధర్మాసనం తీర్పును వెలువరించింది.  సెక్షన్ 497 కాలం చెల్లిన చట్టంగా సుప్రీంకోర్టు ధర్మాసనం అభిప్రాయపడింది.

మహిళలకు సమానహక్కులు కల్పించాలన్ని స్పూర్తికి  497 సెక్షన్ తూట్లు పడుతున్నాయని న్యాయస్థానం అభిప్రాయపడింది. మహిళల అసమానతలకు అడ్డుపడే  ఏ నిబంధన అయినా రాజ్యాంగపరమైంది కాదని వ్యాఖ్యానించింది.

వివాహేతర సంబంధం కారణంగా ఆత్మహత్య ఇతర తీవ్రమైన నేరాలకు దారితీస్తే నేరంగా పరిగణించాలని కోర్టు అభిప్రాయపడింది. వివాహేతర సంబంధం కారణంగా విడాకులు అడగొచ్చని కూడ సుప్రీం కోరింది.స్త్రీని అంగడి సరుకుగా చూడకూడదన్నారు. స్త్రీ ని అంగడి సరుకుగా చూసే చట్టాన్ని అనుమతించబోమని కోర్టు తేల్చి చెప్పింది. అడల్టరీ చట్టం రాజ్యాంగబద్దం కాదని కోర్టు అభిప్రాయపడింది.

 

సంబంధిత వార్తలు

ఇష్టపూర్వక వివాహేతర శృంగారం: 497 సెక్షన్ ఏం చెబుతోంది?