Asianet News TeluguAsianet News Telugu

మహారాష్ట్ర సర్కార్‌కి సుప్రీం షాక్: మరాఠా రిజర్వేషన్లు కొట్టివేత

మరాఠా రిజర్వేషన్లను  సుప్రీంకోర్టు బుధవారం నాడు కొట్టివేసింది. ఈ రిజర్వేషన్లు చట్టవిరుద్దమని ఉన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. 

Supreme Court strikes down Maratha Reservation law for exceeding 50 percent cap lns
Author
Mumbai, First Published May 5, 2021, 11:05 AM IST

మరాఠా రిజర్వేషన్లను  సుప్రీంకోర్టు బుధవారం నాడు కొట్టివేసింది. ఈ రిజర్వేషన్లు చట్టవిరుద్దమని ఉన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. ప్రభుత్వవిద్య,ఉపాధిలో సామాజికంగా,ఆర్ధికంగా వెనుకబడిన మరాఠాలకు ఈ రిజర్వేషన్లను వర్తింపజేయాలని మహారాష్ట్ర సర్కార్ నిర్ణయం తీసుకొంది. రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదని గతంలోని తీర్పును సుప్రీంకోర్టు ఈ సందర్భంగా ప్రస్తావించింది. రిజర్వేషన్లు 50 శాతం దాటితే ఆర్టికల్ 14, 15 ఉల్లంఘనగా ఉన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. మరాఠాలకు 50 శాతానికి మించి రిజర్వేషన్లు కల్పించేందుకు అసాధారణ పరిస్థితులు లేవని కోర్టు అభిప్రాయపడింది.ఐదు బెంచ్‌ల ధర్మాసనం ఈ విషయమై బుధవారం నాడు తీర్పును వెలువరించింది..

 

ఆశోక్ భూషన్, ఎల్. నాగేశ్వరరావు, అబ్దుల్ నజీర్, హేమంత్ గుప్తా, రవీంద్ర భట్ లు రిజర్వేషన్లు 50 శాతం మించడాన్ని వ్యతిరేకించారు.గత ఏడాది మరాఠాలకు విద్య, ఉపాధి రంగాల్లో శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీ సంకీర్ణ సర్కార్ 12 శాతం రిజర్వేషన్లను అమలు చేస్తోంది.రిజర్వేషన్ల 50 శాతానికి పరిమితి విధించాలనే నిర్ణయాన్ని పున: పరిశీలించాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. పీజీ, మెడికల్ కోర్సుల్లో మునుపటి ప్రవేశాలు కొనసాగుతాయని వెల్లడించింది.

Follow Us:
Download App:
  • android
  • ios