అది చట్టవిరుద్దం.. రాహుల్ గాంధీకి శిక్ష విధించిన జడ్జితో సహా 68 మంది జడ్జీల పదోన్నతిపై సుప్రీంకోర్టు స్టే.. 

గుజరాత్‌లోని 68 మంది న్యాయమూర్తుల పదోన్నతిపై సుప్రీంకోర్టు స్టే విధించింది. పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీకి శిక్ష విధించిన సూరత్ చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ హరీష్ హస్ముఖ్ భాయ్ వర్మ కూడా ఇందులో ఉన్నారు. 

Supreme Court stays promotion of CJM who convicted Rahul Gandhi, 67 other Gujarat judges KRJ

గుజరాత్ లో వివిధ కోర్టుల్లో పనిచేస్తున్న 68 మంది న్యాయమూర్తులకు సంబంధించిన ప్రమోషన్లపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. వారి పదోన్నతి చట్టవిరుద్దమని సుప్రీం కోర్టు స్టే విధించింది. పరువు నష్టం కేసులో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీని దోషిగా నిర్ధారించిన సూరత్ చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ హరీష్ హస్ముఖ్ భాయ్ వర్మ కూడా ఇందులో ఉన్నారు. వీరి ప్రమోషన్లు చట్ట విరుద్దమని సర్వోన్నత  న్యాయస్థానం పేర్కొంది.

2011లో సవరించిన గుజరాత్ స్టేట్ జ్యుడీషియల్ సర్వీస్ రూల్స్ 2005 ప్రకారం మెరిట్-కమ్-సీనియారిటీ, అనుకూలత పరీక్షలో ఉత్తీర్ణత అనే సూత్రంపై పదోన్నతులు కల్పించాలని న్యాయమూర్తులు ఎంఆర్ షా, సిటి రవికుమార్‌లతో కూడిన ధర్మాసనం పేర్కొంది. గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశం నిలకడగా లేదనీ, హైకోర్టు జారీ చేసిన ప్రమోషన్ల జాబితా,జిల్లా జడ్జిలకు పదోన్నతులు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వు చట్టవిరుద్ధమని, ఈ కోర్టు తీర్పుకు విరుద్ధమని ధర్మాసనం పేర్కొంది.
 
ప్రమోషన్ జాబితా అమలుపై నిషేధం

హరీష్ హస్ముఖ్ భాయ్ తో సహా 68 మంది న్యాయమూర్తులను జిల్లా జడ్జీ క్యాడర్ కు ప్రమోట్ చేస్తూ గుజరాత్ హైకోర్ట్ సెలక్షన్ లిస్టు తయారు చేసింది.  అయితే.. ఆ ప్రమోషన్ జాబితా అమలును నిలిపివేస్తామనీ, సంబంధిత ప్రమోట్‌లు వారి  ముందు వారు కలిగి ఉన్న వారి అసలు పోస్టులకు తిరిగి పంపబడతారని అని బెంచ్ పేర్కొంది. పదోన్నతిపై స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన ధర్మాసనం, మే 15న జస్టిస్ షా పదవీ విరమణ చేయనున్నందున ఈ అంశాన్ని తగిన ధర్మాసనం విచారించాలని ఆదేశించింది. సీనియర్ సివిల్ జడ్జి కేడర్ ఆఫీసర్లు రవికుమార్ మెహతా, సచిన్ ప్రతాప్రయ మెహతా, జిల్లా జడ్జిల హయ్యర్ క్యాడర్‌లో 68 మంది జ్యుడీషియల్ అధికారుల ఎంపికను సవాలు చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారించింది.

గుజరాత్ ప్రభుత్వానికి నోటీసు 

ఏప్రిల్ 13న ఇద్దరు న్యాయాధికారుల పిటిషన్‌పై  గుజరాత్ ప్రభుత్వానికి, హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్‌కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ అంశం పెండింగ్‌లో ఉన్నప్పటికీ న్యాయ అధికారులకు పదోన్నతి కల్పించాలని నిర్ణయించి ఏప్రిల్ 18న దీనికి సంబంధించి ఉత్తర్వులు జారీ చేయడంపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios