Asianet News TeluguAsianet News Telugu

బెంగ‌ళూరు ఈద్గా మైదానంలో గణేష్ చతుర్థి వేడుకలపై సుప్రీంకోర్టు కీల‌క ఆదేశాలు

క‌ర్నాట‌క‌: బెంగ‌ళూరులోని ఈద్గా మైదానంలో గణేష్ చతుర్థి వేడుకలను నిర్వ‌హించ‌వ‌ద్ద‌ని సుప్రీంకోర్టు కీల‌క ఆదేశాలు జారీ చేసింది. విచార‌ణ సంద‌ర్భంగా 200 ఏళ్లుగా ఇలాంటి కార్య‌క్ర‌మం నిర్వ‌హించ‌లేద‌ని, యథాత‌థ స్థితిని కొన‌సాగించాల‌ని పేర్కొంది.
 

Supreme Court's key orders on Ganesh Chaturthi celebrations at Bangalore Eidgah Maidan
Author
First Published Aug 30, 2022, 11:45 PM IST

బెంగ‌ళూరు ఈద్గా మైదానం: బెంగళూరులోని ఈద్గా మైదానంలో యథాతథ స్థితిని నెలకొల్పాలని సుప్రీంకోర్టు మంగళవారం ఆదేశించింది. ఇక్క‌డ గణేష్ చతుర్థి వేడుకలు నిర్వహించరాదని పేర్కొంది. ఆగస్టు 30, 31 తేదీల్లో రాష్ట్ర ప్రభుత్వం మతపరమైన వేడుకలను నిర్వహించుకునేందుకు వీలు కల్పిస్తూ కర్ణాటక హైకోర్టు ఆగస్టు 26న జారీ చేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ కర్ణాటక వక్ఫ్ బోర్డు, సెంట్రల్ ముస్లిం అసోసియేషన్ ఆఫ్ కర్ణాటక దాఖలు చేసిన పిటిషన్‌పై ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. క‌ర్నాట‌క హైకోర్టు జారీ చేసిన ఉత్త‌ర్వుల‌ను సైతం నిలిపివేసింది. 

200 ఏళ్లుగా ఇలాంటి కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించ‌లేద‌ని, ప్ర‌శ్న‌లో ఉన్న భూమి వ‌క్ఫ్ బోర్డుకు చెందుతుంద‌ని, య‌థాత‌థ స్థితిని కొనసాగించాల‌ని ఆదేశించింది. పిటిషన్‌లో లేవనెత్తిన ఇతర అంశాల‌ను హైకోర్టు నిర్ణయిస్తుందని, అప్పీల్‌ను పరిష్కరిస్తామని కోర్టు తెలిపింది. మరోవైపు బెంగళూరులోని చామరాజ్‌పేటలోని ఈద్గా మైదానంలో భద్రతా సిబ్బంది ఫ్లాగ్‌మార్చ్‌ నిర్వహించారు. ఈ అంశంపై ఏకాభిప్రాయం సాధించడంలో న్యాయమూర్తులు హేమంత్ గుప్తా, సుధాన్షు ధులియా విఫలమవడంతో అంతకుముందు రోజు, భారత ప్రధాన న్యాయమూర్తి యూయూ లలిత్ ఈ అంశాన్ని ఇందిరా బెనర్జీ, ఎఎస్ ఓకా, ఎంఎం సుందరేష్‌లతో కూడిన త్రిసభ్య ధర్మాసనానికి సూచించారు.

దక్షిణాది రాష్ట్రమైన క‌ర్నాట‌క‌లో ముఖ్య‌మంత్రి బసవ రాజ్ బొమ్మై నేతృత్వంలోని భార‌తీయ జ‌న‌తా పార్టీ (బీజేపీ) ప్రభుత్వం ఆగస్టు 31 నుండి పరిమిత కాలం పాటు మతపరమైన-సాంస్కృతిక కార్యక్రమాలను అనుమతించినట్లు గతంలో సుప్రీంకోర్టుకు తెలిపింది. వక్ఫ్ బోర్డు తరపున వాదించిన కపిల్ సిబల్.. కర్ణాటక హైకోర్టు డివిజన్ బెంచ్ ఉత్తర్వులు అనవసరమైన ఉద్రిక్తతను సృష్టిస్తాయని సుప్రీంకోర్టుకు తెలిపారు. ఈద్గా మైదాన్ యాజమాన్యంపై వక్ఫ్ బోర్డు-నగర పరిపాలనా సంస్థ - బృహత్ బెంగళూరు మహానగర పాలికే (BBMP) మధ్య వివాదానికి కేంద్రంగా ఉంది. ఈ నెల ప్రారంభంలో ఈ ఆస్తి రెవెన్యూ శాఖకు చెందినదని చెప్పారు. 

విచారణ సందర్భంగా, రాష్ట్ర తరపు న్యాయవాది "ప్రభుత్వ నిర్వహణలో గణేష్ చతుర్థి వేడుకలకు అనుమ‌తించాల‌నీ, మండ‌పాలు ఏర్పాటు చేస్తామ‌నీ, అయితే, శాశ్వత నిర్మాణాలు చేప‌ట్ట‌మ‌ని"  చెప్పారు. దీంతో వ‌క్ఫ్ బోర్డు తరఫు న్యాయవాది "బాబ్రీ మసీదు విషయంలో అప్పటి ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి కూడా హామీ ఇచ్చారు. అక్కడ ఏం జరిగిందో మీకు తెలుసు" అని 1992లో మసీదు కూల్చివేతపై ప్రస్తావిస్తూ, దాని స్థానంలో రామమందిరం ఉంది. ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు తర్వాత తెరపైకి అనేక విష‌యాలు వ‌చ్చాయ‌ని అన్నారు. బెంగళూరులోని ఈద్గా మైదాన్‌లో ఇవాళ భారీగా పోలీసులు మోహరించారు. మతపరమైన మైనారిటీల హక్కులను తుంగలో తొక్కి వారిపై ముద్ర వేయవద్దని న్యాయవాది దుష్యంత్ దవే కూడా కోర్టుకు తెలిపారు. 

"ఈ ఆస్తిలో మరే ఇతర వర్గాలకు చెందిన మతపరమైన కార్యక్రమాలు జరగలేదు... చట్టం ప్రకారం దీనిని వక్ఫ్ ఆస్తిగా ప్రకటించారు. 2022లో అకస్మాత్తుగా, ఇది వివాదాస్పద భూమి అని, వారు ఇక్కడ గణేష్ చతుర్థి పండుగను నిర్వహించాలనుకుంటున్నారు" అని బోర్డు పేర్కొంది. వ‌క్ఫ్ బోర్డు వచ్చే ఏడాది ఎన్నికలు గురించి కూడా ప్రస్తావించింది. ప్రభుత్వ చర్య వెనుక రాజకీయ ఉద్దేశాల‌ను సూచిస్తున్నాయ‌నీ, వ‌చ్చే ఏడాది రాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయ‌ని కూడా పేర్కొంది.

Follow Us:
Download App:
  • android
  • ios