న్యూఢిల్లీ: కరోనా  విషయమై పౌరులు సోషల్ మీడియాలో  తమ వేదనను  తెలిపితే  వాటిని  అడ్డుకొనే ప్రయత్నం చేయవద్దని  సుప్రీంకోర్టు  సూచించింది.శుక్రవారం నాడు  కరోనా పరిస్థితులపై సుప్రీంకోర్టు విచారణ నిర్వహించింది.  కరోనా విషయంలో సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన  వారిని వేధిస్తే కోర్టు ధిక్కారంగా భావించాల్సి వస్తోందని సుప్రీంకోర్టు ధర్మాసనం హెచ్చరించింది.పౌరుడిగా లేదా న్యాయమూర్తిగా  ఈ పరిణామం తనకు ఆందోళన కలిగిస్తోందన్నారు. పౌరుల వేదనలను తాము వింటామని సుప్రీంకోర్టు తెలిపింది. మే 1వ తేదీ నుండి 18 ఏళ్లు దాటినవారికి వ్యాక్సిన్ వేసుకొనే వెసులుబాటును కేంద్రం కల్పించింది. అయితే  వ్యాక్సిన్  ను 100 శాతం ప్రభుత్వం ఎందుకు కొనుగోలు చేయడం లేదని ఉన్నత న్యాయస్థానం ప్రశ్నించింది.  

also read:ఇండియాలో కరోనా జోరు: 24 గంటల్లో 3,498 మంది మృతి, 3.86 లక్షల కేసులు

కేంద్ర, రాష్ట్రాలకు వ్యాక్సిన్ అమ్మే ధరల్లో ఎందుకు వ్యత్సాసం ఉందని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. కరోనా వ్యాక్సిన్ వేయించుకొనే నిరక్షరాస్యులు తమ పేర్లను యాప్ లలో ఎలా నమోదు చేసుకోవాలో చెప్పాలని కోర్టు అడిగింది. చంద్రచూడ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. ఆక్సిజన్ సరఫరాపై కేంద్రం దాఖలు చేసిన అఫిడవిట్ లో సరైన వివరాలు లేవని  సుప్రీంకోర్టు  ఆగ్రహం వ్యక్తం చేసింది. వ్యాక్సిన్ తయారీకి  ఎంత ఖర్చు చేశారని కోర్టు ప్రశ్నించింది.