మహారాష్ట్రలో ఆరేళ్ల బాలిక హత్యారం జరిగింది. నిందితుడిని ట్రయల్ కోర్టు దోషిగా తేల్చి యావజ్జీవం విధించింది. అనంతరం, బాంబే హైకోర్టు కూడా ఇదే తీర్పును సమర్థించింది. తాజాగా, నిందితుడు వీటి తీర్పులను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. సుప్రీంకోర్టు ఆయనను నిర్దోషిగాతేల్చింది.
న్యూఢిల్లీ: 2010లో ఆరేళ్ల బాలికపై అత్యాచారం జరిగింది. అనంతరం, ఆమెను హతమార్చారు. ఈ కేసులో నిందితుడికి ట్రయల్ కోర్టు మరణ శిక్ష విధించింది. బాంబే హైకోర్టు కూడా అదే తీర్పును సమర్థించింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ నిందితుడు సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. తాజాగా, సుప్రీంకోర్టు నిందితుడికి ఊరట ఇచ్చింది. మరణ శిక్షను రద్దు చేసింది.
ఈ కేసు దర్యాప్తులో అడుగడుగున లోపాలే ఉన్నాయని సుప్రీంకోర్టు తెలిపింది. మొత్తం దర్యాప్తు చెబుతున్న విషయాల్లోనూ భారీగా తేడాలు ఉన్నాయని చెప్పింది. దర్యాప్తులోని అనేక లోపాలు ఆ నేరం జరిగిన తీరుకు సంబంధించిన కథనంపై మచ్చగా మిగిలాయని పేర్కొంది. ఒక దాని వెంట మరొకటి జరిగిన ఘటనలు, వాటి పరిస్థితులనూ సరిగా రుజువు చేసేలా లేవని వివరించింది.
జస్టిస్ బీఆర్ గవాయ్ సారథ్యంలోని ధర్మాసనం దిగువ కోర్టులు దోషిగా తేల్చి విధించిన శిక్షను రద్దు చేసింది. ట్రయల్ కోర్టు ఆ నిందితుడికి మరణ శిక్ష విధించింది.2015 అక్టోబర్‌లో బాంబే హైకోర్టు అదే తీర్పును సమర్థించింది.
అనంతరం, నిందితుడు సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. ఈ పిటిషన్‌ను సుప్రీంకోర్టు అనుమించింది. ఆయన దోషిగా తేల్చడాన్ని తప్పుపట్టింది. వేరే కేసులతో సంబంధం లేకుంటే ఆయనకు స్వేచ్ఛ కల్పించాలని సూచించింది.
Also Read: నెక్స్ట్ ఏం చేస్తారు? బీజేపీయేతర రాష్ట్రాలనూ అదుపులోకి తీసుకుంటారా?: కేంద్రంపై రాఘవ్ చద్దా విమర్శలు
చాలా బాధాకరమైన ఘటన జరిగిందని, చిన్న పిల్ల దారుణానికి గురై ప్రాణాలు కోల్పోయిందనేదాన్ని కాదనలేం అని జస్టిస్ విక్రమ్ నాథ్, సంజయ్ కరోల్ సభ్యులుగా ఉన్న ధర్మాసనం తెలిపింది. ఉజ్వల భవిష్యత్తు ఉన్న చిన్నారి ప్రాణాలు కోల్పోయిందని పేర్కొంది. బాధితురాలి తల్లిదండ్రుల వేదనా వర్ణనాతీతం అని వివరించింది.
ఇలాంటి బాధాకర వాస్తవాలు ఉన్నప్పటికీ న్యాయబద్ధంగతా తాము అతడిని దోషిగా చెప్పలేమని స్పష్టం చేశారు.
ఈ కేసులో ప్రాసిక్యూషన్ ప్రాథమికంగా ప్రత్యక్ష సాక్షులపై ఆధారపడలేదని వివరించారు. కేవలం వాంగ్మూలాల ఆధారంగా దర్యాప్తు జరిపి కొన్ని నేరానికి సంబంధించిన వస్తువలు సేకరించి, వాటి ఆధారంగా ఆ నిందితడిని దోషిగా తేల్చారని తెలిపింది.
