Asianet News TeluguAsianet News Telugu

సుప్రీంలో ఏక్‌నాథ్ షిండే‌కు ఎదురు దెబ్బ: శివసేన ఆస్తుల బదలాయింపు పిటిషన్ కొట్టివేత


సుప్రీంకోర్టులో  మహారాష్ట్ర సీఎం  ఏక్ నాథ్ షిండే  వర్గానికి  ఇవాళ ఎదురు దెబ్బ తగిలింది.  శివసేన  ఆస్తులను  బదలాయించాలని  షిండే  వర్గం దాఖలు  చేసిన పిటిషన్ ను  సుప్రీంకోర్టు  తోసిపుచ్చింది. 

 Supreme Court rejects plea for transfer of   Shiv Sena   assets from Thackeray faction to Shinde group lns
Author
First Published Apr 28, 2023, 1:25 PM IST

న్యూఢిల్లీ : మహారాష్ట్ర సీఎం  ఏక్ నాథ్ షిండేకు  శుక్రవారంనాడు  సుప్రీంకోర్టులో  ఎదురు దెబ్బ తగిలింది.  ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని  శివసేన పార్టీకి  ఉన్న  ఆస్తులను  ఏక్ నాథ్  షిండే గ్రూప్ నకు  బదలాయించేలా  మహారాష్ట్ర ప్రభుత్వాన్ని బదలాయించాలని   దాఖలైన  పిటిషన్ ను  సుప్రీంకోర్టు  కొట్టివేసింది. 

ఈ పిటిషన్ ను  సుప్రీంకోర్టు  చీఫ్ జస్టిస్  డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం  తోసిపుచ్చింది. మీరెవరు, మీ స్థానం ఏమిటీ, అని  బెంచ్ ప్రశ్నించింది.   ఠాక్రే, షిండే వర్గాలకు  చెందిన పలు పిటిషన్లను  సుప్రీంకోర్టు  విచారించింది. 

ఉద్ధవ్  ఠాక్రే  నేతృత్వంలోని శివసేన ఆస్తులను  బదలాయించాలని  ఏక్ నాథ్ షిండే  తరపు న్యాయవాది  గిరి  సుప్రీంకోర్టు ధర్మాసనాన్ని కోరారు.  ఇది ఎలాంటి పిటిషన్ , మీ అభ్యర్ధనను  స్వీకరించలేమని  సుప్రీంకోర్టు ధర్మాసనం తెలిపింది. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios