Asianet News TeluguAsianet News Telugu

యాక్టివిస్ట్ అయితే అసభ్యతను వ్యాపింపజేస్తారా... రెహానా ఫాతిమాకు సుప్రీంలో ఎదురుదెబ్బ

కేరళ యాక్టివిస్ట్ రెహానా ఫాతిమాకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. అర్థనగ్న శరీరంపై కన్నబిడ్డలతో వాటర్ పెయింటింగ్ వేయించుకుంటూ రెహానా ఇటీవల ‘‘ బాడీ ఆర్ట్స్ అండ్ పాలిటిక్స్’’ పేరిట సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు

supreme court rejects kerala activists rehana fathima bail plea over semi nude online post
Author
New Delhi, First Published Aug 7, 2020, 10:14 PM IST

కేరళ యాక్టివిస్ట్ రెహానా ఫాతిమాకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. అర్థనగ్న శరీరంపై కన్నబిడ్డలతో వాటర్ పెయింటింగ్ వేయించుకుంటూ రెహానా ఇటీవల ‘‘ బాడీ ఆర్ట్స్ అండ్ పాలిటిక్స్’’ పేరిట సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఆమెపై కేసు నమోదు చేసిన పోలీసులు అరెస్ట్ చేశారు.

ఈ సందర్భంగా ముందస్తు బెయిల్‌ను కోరుతూ రెహానా సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. దీనిని విచారించిన జస్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలోని ముగ్గురు సభ్యులతో కూడిన ధర్మాసనం ఆ పిటిషన్‌ను కొట్టివేసింది.

ఈ సందర్భంగా బెంచ్ కీలక కీలక వ్యాఖ్యలు చేసింది. అసలు మీరెందుకు ఇదంతా చేశారు... మీరు యాక్టివిస్టే కావొచ్చు. అయినంత మాత్రాన ఇలా ఎందుకు ప్రవర్తించారని ప్రశ్నించింది. సమాజంపై ఇది చాలా దుష్ప్రభావం చూపుతోంది.

మీరు అసభ్యతను వ్యాపింపజేస్తున్నారు. అసలు ఇలాంటి చర్యలు ఎదుగుతున్న పిల్లలపై ఎలాంటి ప్రభావాలు చూపుతాయో తెలుసా అని అసహనం వ్యక్తం చేసింది.

రెహానా తరపున వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది గోపాల్ శంకర్ నారాయణ్ మాట్లాడుతూ.. తన క్లైంట్‌పై చైల్డ్ పోర్నోగ్రఫీ కింద ఆరోపణలు చేయడం సరైంది కాదన్నారు.

పలు ఆలయాల్లో కొన్ని దేవతా మూర్తులు కూడా అర్థనగ్నంగా కనిపిస్తాయని.. అయినప్పటికీ ఆలయానికి వెళ్లిన వారికి లైంగిక ప్రేరణలు బదులు ఆ విగ్రహాల్లో దైవత్వమే కనిపిస్తుందని ఫాతిమా పేర్కొన్నారు.

తల్లి శరీరంపై బిడ్డల పెయింటింగ్ కూడా ఇలాంటిదేనన్న ఆమె.. పిటిషన్‌ను విచారించిన హైకోర్టు, ముందస్తు బెయిల్‌కు నిరాకరించడంతో సుప్రీంకోర్టు ఆశ్రయించగా అక్కడ కూడా ఎదురుదెబ్బ తగిలింది. 

Follow Us:
Download App:
  • android
  • ios