దేశ చరిత్రలో మాయని మచ్చగా మిగిలిన 1984 సిక్కుల ఊచకోత కేసులో మరణశిక్ష‌ విధించబడిన కాంగ్రెస్ మాజీ ఎంపీ సజ్జన్ కుమార్‌కు బెయిల్ మంజూరు చేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది.

బెయిల్ మంజూరు చేయడం కుదరదని స్పష్టం చేసింది. ఇది చిన్న కేసు కాదని.. సజ్జన్‌కు బెయిల్ ఇవ్వలేమని సర్వోన్నత న్యాయస్థానం తేల్చి చెప్పింది. వైద్య అవసరాలను చూపుతూ సజ్జన్ కుమార్ బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.

దీనిపై చీఫ్ జస్టిస్ ఎస్ఏ బోబ్డే, జస్టిస్ ఏఎస్ బోపన్న, వి రామసుబ్రహ్మణ్యంతో కూడిన త్రిసభ్య ధర్మాసనం శుక్రవారం విచారణ జరిపింది. చికిత్స అవసరం లేదని రిపోర్టులు రిపోర్టులు స్పష్టం చేశాకా సజ్జన్ ఆసుపత్రిలో వుండాల్సిన అవసరం లేదని న్యాయస్థానం వ్యాఖ్యానించింది.

Also Read:1984 సిక్కు అల్లర్ల కేసు: కాంగ్రెస్‌ సీనియర్ నేత గులాటీకి జీవిత ఖైదు

మరణశిక్షను రద్దు చేయాలనే అప్పీలును న్యాయస్థానాలు భౌతికంగా పనిచేసినప్పుడు పరిశీలిస్తామని సర్వోన్నత న్యాయస్థానం వెల్లడించింది. కాగా కరోనా వైరస్ నేపథ్యంలో ప్రస్తుతం వీడియో కాన్ఫరెన్స్‌ల ద్వారానే కేసుల విచారణ జరుపుతున్నారు.

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన 1984 ఢిల్లీ సిక్కు అల్లర్ల కేసులో ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసులో కీలక ప్రధాని నిందితుడిగా ఉన్న కాంగ్రెస్ సీనియర్ నేత సజ్జన్ కుమార్ గులాటీకి జీవితఖైదు విధిస్తూ 2018 డిసెంబర్ 17న తీర్పు చెప్పిన సంగతి తెలిసిందే.

1984లో నాటి ప్రధాని ఇందిరాగాంధీ ఆమె అంగరక్షకులైన సిక్కు గార్డుల చేతిలో దారుణ హత్యకు గురయ్యారు. ఇందిర మరణాన్ని జీర్ణించుకోలేని కాంగ్రెస్ కార్యకర్తలు ఢిల్లీతో పాటు పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్న సిక్కుల ఇళ్లపై దాడికి దిగారు. ఈ అల్లర్లలో వేలాది మంది మరణించగా, ఎంతమంది సిక్కు మహిళలు అత్యాచారాలకు గురయ్యారు.