Asianet News TeluguAsianet News Telugu

నీట్ పీజీ పరీక్షలు: ఎగ్జామ్స్ వాయిదాకి సుప్రీం కోర్టు నో


నీట్ పీజీ పరీక్షలను వాయిదా వేయడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది.  నీట్ పీజీ పరీక్ష ఈ నెల 21న నిర్వహించనున్నారు. ఈ సమయంలో ఈ పరీక్షను వాయిదా వేయాలని పిటిషనర్లు సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు.

Supreme Court Refuses to postpone NEET PG exam
Author
New Delhi, First Published May 13, 2022, 12:32 PM IST

న్యూఢిల్లీ: NEET పీజీ పరీక్షల వాయిదాకు సుప్రీంకోర్టు నిరాకరించింది. నీట్ PG-2021 కౌన్సిలింగ్ ఉన్నందున పరీక్షలు వాయిదా వేయాలని పిటిషనర్లు Supreme Court ను కోరారు.నీట్ పీజీ-2022 విద్యార్ధులు ఇబ్బందులకు గురౌతారని సుప్రీంకోర్టు  తెలిపింది. ఈ ఏడాది మే 21న  నీట్ పీజీ పరీక్షను నిర్వహించనున్నారు. 

IMA సహా పలు వైద్య సంఘాలు కూడా నీట్ పీజీ పరీక్షను రీ షెడ్యూల్ చేయాలని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మాండవియాను అభ్యర్ధించాయి. నీట్ పీజీ 2022 పరీక్షకు 2021 కౌన్సిలింగ్ కి మధ్య తేడా చాలా తక్కువగా ఉందని కూడా వారు గుర్తు చేశారు.

also read:NEET PG 2022 Admit Card: మే 21న నీట్ పీజీ 2022 పరీక్ష.. అడ్మిట్ కార్డు స‌హా మ‌రిన్ని వివ‌రాలు !

నీట్ పీజీ పరీక్షలు వాయిదా వేయడం వల్ల ఆసుపత్రుల్లో గందరగోళం, అనిశ్చితితో పాటు వైద్యుల కొరత కూడా ఏర్పడే అవకాశం ఉందని జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ద్విసభ ధర్మాసనం అభిప్రాయపడింది. ఈ పరీక్షలు రాసే 2 లక్షల మంది అభ్యర్ధులకు కూడా నష్టం వాటిల్లే అవకాశం ఉందని ధర్మాసనం తెలిపింది.  పరీక్షను వాయిదాను ఎలా చేస్తామని  కోర్టు ప్రశ్నించింది. 

నీట్ పీజీ పరీక్ష నిర్వహణలో ఏ మాత్రం ఆలస్యమైనా రెసిడెంట్ వైద్యుల సంఖ్య తక్కువగా ఉంటుందని బెంచ్ పేర్కొంది. నీట్ పీజీ 2022 పరీక్ష వాయిదా వేయడంతో రోగి సంరక్షణ, వైద్యుల కెరీర్ పై ప్రభావం చూపుతుందన్నారు. రోగుల సంరక్షణ అవసరాలు చాలా ముఖ్యమైనవన్నారు. నీట్ పీజీ 2022 పరీక్షను ఈ నెల 21న నిర్వహించడం కోసం నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ సైన్సెస్ పిబ్రవరి 4న  నోటిఫికేషన్ జారీ చేసింది. 

Follow Us:
Download App:
  • android
  • ios