న్యూఢిల్లీ:ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ ను ఉన్నత న్యాయస్థానం తిరస్కరించింది. కోర్టు ధిక్కార కేసు విచారణను వాయిదా వేయాలని కోరుతూ ఆయన దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు గురువారం నాడు తిరస్కరించింది.

ఉన్నత న్యాయస్థానం, చీఫ్ జస్టిస్ బాబ్డే ప్రతిష్టకు భంగం కల్గించేలా ట్వీట్లు చేశారనే విషయమై ప్రశాంత్ భూషణ్ ను దోషిగా ఈ నెల 14వ తేదీన సుప్రీంకోర్టు తేల్చింది.

ఈ కేసులో సుప్రీంకోర్టు ఇవాళ తీర్పును ఇవాళ ఇవ్వనుంది. అయితే కోర్టు ధిక్కార కేసు విచారణను వాయిదా వేయాలని ప్రశాంత్ భూషణ్ పిటిషన్ దాఖలు చేశారు.ఈ కేసు మరో బెంచీకి తరలించాలని కూడ కోరారు. అయితే దీన్ని సుప్రీంకోర్టు బెంచీ తిరస్కరించింది. 

ఈ ఏడాది జూన్ 27, 29 తేదీల్లో ప్రశాంత్ భూషణ్ రెండు ట్వీట్లు చేశారు. కోర్టులను మూసివేసి  ప్రజాస్వామ్యాన్ని నాశనం చేస్తున్నారని ప్రశాంత్ భూషణ్ ఆ ట్వీట్లలో విమర్శలు చేశారు.ఈ విషయాన్ని సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకొని విచారణ చేసింది. ప్రశాంత్ భూషణ్ ను దోషిగా తేల్చింది.

  ఉద్దేశ్యపూర్వకంగా ఎవరైనా కోర్టు ధిక్కారానికి పాల్పడితే ఆరు నెలల జైలు శిక్షతో పాటు రూ. 2 వేల జరిమానాను విధించొచ్చు. రెండింటిని కూడ విధించే అవకాశం ఉంది.