Asianet News TeluguAsianet News Telugu

జర్నలిస్టు వినోద్ దువాపై దేశద్రోహం కేసు కొట్టివేత

జర్నలిస్ట్  వినోద్ దువాపై దేశద్రోహం కేసును గురువారం నాడు సుప్రీంకోర్టు కొట్టివేసింది.

Supreme Court quashes sedition case against senior journalist Vinod Dua lns
Author
New Delhi, First Published Jun 3, 2021, 11:06 AM IST

న్యూఢిల్లీ: జర్నలిస్ట్  వినోద్ దువాపై దేశద్రోహం కేసును గురువారం నాడు సుప్రీంకోర్టు కొట్టివేసింది.హిమాచల్ రాష్ట్రానికి చెందిన బీజేపీ నేత వినోద్ దువాపై కేసు దాఖలు చేసిన విషయం తెలిసిందే. యుయు లలిత్, వినిత్ శరణ్  బెంచ్  గత ఏడాది అక్టోబర్ 6వ తేదీన ఈ కేసుపై తీర్పును రిజర్వ్ చేసింది. జర్నలిస్ట్ వినోద్ దువాతో పాటు హిమాచల్ ప్రదేశ్ వాదనలు విన్న తర్వాత తీర్పును రిజర్వ్ చేసింది. 

 

గత ఏడాది జూలై 20 నుండి ఈ కేసులో ఏవైనా బలవంతపు చర్యల దువాకు రక్షణ కల్పించాలని తదుపరి కోర్టు ఆదేశించింది. బీజేపీ మహాసు యూనిట్ అధ్యక్షుడు అజయ్ శ్యామ్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా దువాపై  124 ఎ తదితర సెక్షన్ల కింద కేసు నమోదు చేసింది. మార్చి 30న  తన 15 నిమిషాల యూట్యూబ్ షోలో విచిత్ర మైన ఆరోపణలు చేశారని బీజేపీ నాయకులు ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.గత ఏడాది జూలై 20న బలవంతపు చర్యల నుండి దువాకు రక్షణ కల్పించాలని ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.

Follow Us:
Download App:
  • android
  • ios