నిర్భయ దోషి ముఖేష్ సింగ్ పిటిషన్ కొట్టివేసిన సుప్రీం
నిర్భయ కేసులో దోషి ముఖేష్ సింగ్ కుమార్ దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు బుధవారంనాడు కొట్టివేసింది.
నిర్భయ కేసులో దోషి ముఖేస్ సింగ్ పిటిషన్‌ను బుధవారం నాడు సుప్రీంకోర్టు కొట్టివేసింది.
నిర్భయ కేసులో ముఖేష్ సింగ్ రాష్ట్రపతి తిరస్కరించిన క్షమాభిక్ష పిటిషన్‌ను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. క్షమాభిక్షను సవాల్ చేసే హక్కు లేదు. అయితే క్షమాభిక్ష పిటిషన్ కు సంబంధించిన ప్రక్రియలో తనకు అన్యాయం జరిగిందని ఆరోపిస్తూ ముఖేష్ సింగ్ ఈ పిటిషన్ ను దాఖలు చేశారు.
Also read:నాపై జైలులో లైంగిక దాడి: నిర్భయ దోషి ముఖేష్ సంచలనం
తన క్షమాబిక్ష పిటిషన్‌ను రాష్ట్రపతి సరిగా చూడలేదని ముఖేష్ సింగ్ అభిప్రాయపడ్డారు. 32 ఏళ్ల ముకేష్ కుమార్ సింగ్ మెర్సీ పిటిషన్ ను రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ జనవరి 17వ తేదీన తిరస్కరించారు. దీంతో నిర్భయ కేసులో దోషి ముఖేష్ సింగ్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఈ పిటిషన్‌పై ఈ నెల 28వ తేదీన సుప్రీంకోర్టు విచారించింది. అంతేకాదు ఈ పిటిషన్‌పై ఈ నెల 29వ తేదీన సుప్రీంకోర్టు విచారణను కొనసాగించింది. ఈ మేరకు బుధవారం నాడు ఉదయం సుప్రీంకోర్టు ముఖేష్ సింగ్ దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది.
Also read:మరో ఎత్తుగడ: మెర్సీ పిటిషన్ తోసివేతపై సుప్రీంకెక్కిన నిర్భయ కేసు దోషి
నిర్భయ కేసుకు సంబంధించిన నలుగురు దోషులను ఫిబ్రవరి 1వ తేదీన ఉరి తీయాలని కోర్టు డెత్ వారంట్ జారీ అయిన విషయం తెలిసిందే. సుప్రీంకోర్టు క్యురేటివ్ పిటిషన్ ను తిరస్కరించిన తర్వాత ముకేష్ సింగ్ రాష్ట్రపతికి మెర్సీ పిటిషన్ పెట్టుకున్నాడు. మరో దోషి అక్షయ్ కుమార్ క్యురేటివ్ పిటిషన్ ను కూడా సుప్రీంకోర్టు తోసిపుచ్చింది.
Also Read: నిర్భయ దోషులు: 24 గంటల పాటు నిఘా, ఆత్మహత్య చేసుకోకుండా జాగ్రత్తలు
Also Read: నిర్భయ దోషులు: 24 గంటల పాటు నిఘా, ఆత్మహత్య చేసుకోకుండా జాగ్రత్తలు
మరో ఇద్దరు దోషులు పవన్ గుప్తా, వినయ్ కుమార్ శర్మ సుప్రీంకోర్టులో క్యురేటివ్ పిటిషన్లు దాఖలు చేసుకోవాల్సి ఉంది. 2012 డిసెంబర్ లో వైద్య విద్యార్థినిపై అత్యాచారం చేసి, చిత్రహింసలు పెట్టి హత్య చేసిన కేసులో నలుగురికి ఉరిశిక్ష పడిన విషయం తెలిసిందే.
ఈ కేసులో దోషులు వారి తరపున కోర్టుల్లో పిటిషన్లు కోర్టుల్లో దాఖలు కాకపోతే ఫిబ్రవరి 1వ తేదీన ఉరి శిక్షను అమలు చేయనున్నారు. ఇప్పటికే దోషులకు ఉరిశిక్ష అమలు చేసేందుకు వీలుగా జైలు అధికారులు ఇప్పటికే ట్రయల్స్ కూడ నిర్వహించారు.