Asianet News TeluguAsianet News Telugu

గాలి జనార్దన్‌ రెడ్డి పిటిషన్‌ను కొట్టివేసిన సుప్రీం కోర్టు.. బళ్లారిలో ఉండేందుకు నెల రోజులే అనుమతి..

కర్ణాటక మాజీమంత్రి గాలి జనార్దనరెడ్డికి సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. గనుల అక్రమ తవ్వకాల కేసులో బెయిల్ నిబంధన సడలించాలన్న గాలి జనార్ధన్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు కొట్టివేసింది. 

Supreme Court on Gali Janardhana Reddy plea to visit Bellary in Karnataka
Author
First Published Oct 10, 2022, 12:40 PM IST

కర్ణాటక మాజీమంత్రి గాలి జనార్దనరెడ్డికి సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. గనుల అక్రమ తవ్వకాల కేసులో బెయిల్ నిబంధన సడలించాలన్న గాలి జనార్ధన్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు కొట్టివేసింది.  అయితే గాలి జనార్ధన్ రెడ్డి.. బళ్లారిలో నెల రోజులే ఉండేందుకు కోర్టు అనుమతించింది. అలాగే గాలి జనార్ధన్ రెడ్డి నిందితుడిగా ఉన్న ఈ కేసు ట్రయల్ మొదలు పెట్టాలని హైదరాబాద్ సీబీఐ కోర్టును సుప్రీం కోర్టు ఆదేశించింది. రోజువారీ విచారణ చేపట్టాలని సూచించింది. ఆరు నెలల్లో విచారణ పూర్తిచేయాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. బళ్లారిలో నెల రోజులే ఉండేందుకు అనుమతించింది. ఈ మేరకు జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ కృష్ణమురారిలతో కూడి ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. 

బళ్లారి రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతంలో మైనింగ్ లీజు సరిహద్దు గుర్తులను మార్చడంతోపాటు అక్రమ మైనింగ్‌కు పాల్పడినట్లు గాలి జనార్ధన్ రెడ్డిపై ఆరోపణలు ఉన్నాయి. కోట్లాది రూపాయల మైనింగ్‌ కుంభకోణంలో గాలి జనార్ధనరెడ్డికి గతంలో బెయిల్‌ మంజూరు చేసిన సుప్రీంకోర్టు.. కర్ణాటకలోని బళ్లారి, ఆంధ్రప్రదేశ్‌లోని కడప, అనంతపురం జిల్లాలతో సహా కొన్ని జిల్లాల్లోకి ప్రవేశించకుండా కఠినంగా ఆంక్షలు విధించింది. అయితే ఇటీవల కర్ణాటకలోని బళ్లారిలో పర్యటించాలని గాలి జనార్దనరెడ్డి సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇటీవలే ఆడపిల్లకు జన్మనిచ్చిన తన కుమార్తెను చూసేందుకు కర్ణాటకలోని బళ్లారి జిల్లాకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. 

ఈ పిటిషన్‌కు సంబంధించి వాదనలు విన్న సుప్రీం ధర్మాసనం తీర్పును నేటికి రిజర్వ్ చేసింది. ఈ క్రమంలోనే నేడు తీర్పును వెలువరించింది. ఈ పిటిషన్‌పై వాదనల సందర్భంగా.. గాలి జనార్దన్ రెడ్డి కుమార్తె ప్రసవం బళ్లారిలో కాకుండా బెంగళూరులో జరిగిందని.. అనంతరం ఆమెను బళ్లారికి తీసుకువచ్చారని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు.

గాలి జనార్ధన్ రెడ్డి తరఫున సీనియర్ న్యాయవాది మీనాక్షి అరోరా వాదనలు వినిపించారు. గాలి జనార్ధన్ రెడ్డి కుమార్తె ఆరోగ్యం బాగోలేకపోవడంతో బెంగళూరు వెళ్లారని, ఆమెకు  సిజేరియన్ శస్త్రచికిత్స జరిగిందని చెప్పారు. ఆమె ఒక కుమార్తెకు జన్మనిచ్చిందని.. ఆమెను చూసేందుకు వెళ్లడానికి గాలి జనార్ధన్ రెడ్డి అనుమతివ్వాలని కోరారు. 

Follow Us:
Download App:
  • android
  • ios