అగ్రవర్ణాల్లోని ఆర్ధికంగా వెనుకబడిన వారికి 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన రాజ్యాంగ సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ పలు ప్రజా సంఘాలు సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశాయి. కేంద్రం చేసిన బిల్లుపై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని పిటిషన్‌లో పేర్కొనాయి.

అయితే దీనిపై ఇవాళ విచారణ చేపట్టిన అత్యున్నత న్యాయస్థానం స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. సమస్య తీవ్రత దృష్ట్యా ఈ అంశాన్ని సున్నితంగా పరిశీలిస్తామని తెలుపుతూ, కేంద్రానికి నోటీసులు జారీ చేశారు సీజేఐ.

1992లో రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదంటూ గతంలో ఇచ్చిన తీర్పును పిటిషనర్లు గుర్తు చేశారు. కొత్తగా ఈబీసీ రిజర్వేషన్ బిల్లు వల్ల వెనుకబడిన వర్గాలకు అన్యాయం జరుగుతుందని తెలిపారు. 10 శాతం రిజర్వేషన్ బిల్లును వెంటను కొట్టివేయాలంటూ పిటిషనర్లు అత్యున్నత న్యాయస్థానాన్ని కోరారు.