Asianet News TeluguAsianet News Telugu

రాందేవ్ బాబాకు సుప్రీం కోర్టు నోటీసులు

 రాందేవ్ బాబా జీవితానికి సంబంధించిన పుస్తకం అమ్మకాన్ని, ప్రచురణను నిలిపివేయాలని ఇటీవల ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కాగా.. ఆ ఆదేశాలను సవాల్ చేస్తూ  ఓ పబ్లిషనర్ సుప్రీం కోర్టును ఆశ్రయించారు.

Supreme Court Notice to Ramdev on Book Publisher's Plea Against HC Order
Author
Hyderabad, First Published Nov 30, 2018, 2:26 PM IST

ప్రముఖ యోగా గురువు రాందేవ్ బాబాకు సుప్రీం కోర్టు నోటీసులు జారీచేసింది.  రాందేవ్ బాబా జీవితానికి సంబంధించిన పుస్తకం అమ్మకాన్ని, ప్రచురణను నిలిపివేయాలని ఇటీవల ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కాగా.. ఆ ఆదేశాలను సవాల్ చేస్తూ  ఓ పబ్లిషనర్ సుప్రీం కోర్టును ఆశ్రయించారు.

ఈ కేసు నేపథ్యంలో  రాందేవ్ బాబాకు కోర్టు నోటీసులు జారీ చేసినట్లు జస్టిస్ మదన్  బి లోకూర్, జస్టిస్ దీపక్ గుప్తా నేతృత్వంలోని దర్మాసనం తెలిపింది. ఈ కేసులో తదుపరి విచారణను న్యాయస్థానం వచ్చే ఏడాది ఫిబ్రవరి మొదటి వారానికి వాయిదా వేసింది.

జగ్గర్ నౌట్ బుక్స్  అనే పబ్లిషన్.. ‘‘గాడ్ మ్యాన్ టూ టైకూన్’’ అనే ప్రస్తుకాన్ని ప్రచురించారు. కాగా.. ఆ పుస్తకం తనను కించపరిచేలా ఉంది అంటూ.. రాందేవ్ బాబా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు.  దీంతో.. కోర్టు ఆ పుస్తకం పై నిషేధం విధించింది. కోర్టు అలా తీర్పు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ పబ్లిషన్ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios