Asianet News TeluguAsianet News Telugu

ఈవీఎంలపై అనుమానాలు: ఈసీకి సుప్రీం నోటీసులు

ఈవీఎంలలో నిక్షిప్తమైన ఓట్లకు వీవీ ప్యాట్‌ స్లిప్పులను సరిపోల్చాలని 21 రాజకీయ పార్టీలు సుప్రీం కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై కేంద్ర ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు శుక్రవారం నాడు నోటీసులు జారీ చేసింది.

Supreme Court issues notice in plea filed by 21 opposition leaders for VVPAT verification
Author
New Delhi, First Published Mar 15, 2019, 12:46 PM IST

న్యూఢిల్లీ: ఈవీఎంలలో నిక్షిప్తమైన ఓట్లకు వీవీ ప్యాట్‌ స్లిప్పులను సరిపోల్చాలని 21 రాజకీయ పార్టీలు సుప్రీం కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై కేంద్ర ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు శుక్రవారం నాడు నోటీసులు జారీ చేసింది.

ఈవీఎంల పనితీరుపై ఇటీవల కాలంలో కొన్ని రాజకీయ పార్టీలు అనుమానాలు వ్యక్తం చేసిన తరుణంలో  ఇటీవలనే బీజేపీయేతర కూటమికి నేతృత్వం వహిస్తున్న 21 రాజకీయ పార్టీలు ఈ విషయమై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి.

ఇదే విషయమై  న్యూఢిల్లీలో కూడ ఈ పార్టీలు సమావేశమై కేంద్ర ఎన్నికల సంఘానికి కూడ వినతిపత్రం సమర్పించిన విషయం తెలిసిందే.

టీడీపీ, కాంగ్రెస్ సహా పలు పార్టీలు కూడ ఇదే రకమైన డిమాండ్ చేస్తున్నాయి. 50 శాతం వీవీప్యాట్‌ స్లిప్పులను లెక్కించాలనే పార్టీల డిమాండ్‌పై  వైఖరిని తెలపాలని కేంద్ర ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు శుక్రవారం నాడు నోటీసులు జారీ చేసింది. ఈ పిటిషన్‌పై విచారణను ఈ నెల 25వ తేదీకి వాయిదా వేస్తూ సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకొంది.
 

Follow Us:
Download App:
  • android
  • ios