Asianet News TeluguAsianet News Telugu

మనీష్ సిసోడియాకు షాకిచ్చిన 'సుప్రీం'..  బెయిల్ పిటిషన్ పై  సంచలన నిర్ణయం..

Manish Sisodia: మద్యం కుంభకోణం కేసులో నిందితుడైన ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా (Manish Sisodia )కు సుప్రీంకోర్ షాకిచ్చింది. ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ ను వచ్చే నెలకు వాయిదా వేసింది.  

Supreme Court gave a shock to Manish Sisodia. Postponement of hearing on bail plea KRJ
Author
First Published Aug 4, 2023, 2:39 PM IST

Manish Sisodia: మద్యం కుంభకోణంలో (Excise policy Case)లో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా (Manish Sisodia )కు ఊరట లభించేలా లేదు. ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణంలో సీబీఐ, ఈడీ దర్యాప్తు చేస్తున్న కేసుల్లో ఆప్ నేత మనీష్ సిసోడియా దాఖాలు చేసిన మధ్యంతర బెయిల్ విచారణను సుప్రీంకోర్టు (Supreme Court)తోసిపుచ్చింది. వచ్చే నెలకి వాయిదా వేసింది. ఈ కేసుల్లో  మాజీ సీఎం సిసోడియా దాఖలు చేసిన  బెయిల్ పిటిషన్ ను ఢిల్లీ హైకోర్టు కొట్టివేసిన విషయం తెలిసిందే. 

అయితే.. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తన భార్య అనారోగ్యంతో బాధపడుతుందనీ, ఈ సమయంలో ఆమెకు తన అవసరం ఉంటుందనీ, ఈ మేరకు తనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ అభ్యర్థించారు. కానీ, సిసోడియా పిటిషన్ విచారించిన జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎస్‌విఎన్ భట్టిలతో కూడిన ధర్మాసనం షాకింగ్ నిర్ణయం తీసుకుంది. మనీష్ సిసోడియా భార్య మెడికల్ రిపోర్టును పరిశీలించిన తర్వాత, ఆమె చాలా బాగుందని, అందువల్ల బెంచ్ సిసోడియా మధ్యంతర బెయిల్ పిటిషన్‌తో పాటు అతని సాధారణ బెయిల్ పిటిషన్‌ను కూడా  పరిగణనలోకి తీసుకుంటామని తెలిపింది. ఈ మేరకు విచారణను సెప్టెంబరు 4కు వాయిదా వేసింది.

అంతకుముందు, జూలై 14న జరిగిన విచారణలో, సిసోడియా మధ్యంతర బెయిల్‌పై సుప్రీంకోర్టు ఈడి , సిబిఐ నుండి స్పందన కోరింది. సిసోడియా ఢిల్లీ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మద్యం కుంభకోణంలో కీలక పాత్ర పోషించినందుకు సిసోడియాను 2023 ఫిబ్రవరి 26న సిబిఐ అరెస్టు చేసింది. అప్పటి నుంచి జైలులోనే ఉన్నాడు. అదే సమయంలో మద్యం కుంభకోణం కేసులోనే మనీలాండరింగ్ ఆరోపణలపై మార్చి 9న సిసోడియాను ఈడీ అరెస్టు చేసింది. అంతకుముందు తీహార్ జైలులోనే ఆయనను ఈడీ విచారించింది.

అంతకుముందు.. సీబీఐ కేసులో సిసోడియాకు బెయిల్ ఇచ్చేందుకు ఢిల్లీ హైకోర్టు మే 30న నిరాకరించింది. అతను రాజకీయాల్లో ఉన్న వ్యక్తి అని, సాక్షులను ప్రభావితం చేసే సామర్థ్యం ఆయనకు ఉందని హైకోర్టు పేర్కొంది. దీని తర్వాత.. జూలై 3న ఈడీ కేసులో కూడా సిసోడియాకు బెయిల్ మంజూరు చేయడానికి హైకోర్టు నిరాకరించింది. అతనిపై ఆరోపణలు చాలా తీవ్రంగా ఉన్నాయని పేర్కొంది. ఈ క్రమంలో సుప్రీం కోర్టును ఆశ్రయించారు. కానీ.. ఉన్నత న్యాయ స్థానంలో కూడా ఎదురుదెబ్బ తగిలింది.

Follow Us:
Download App:
  • android
  • ios