Asianet News TeluguAsianet News Telugu

జూనియర్ తో జడ్జి సరసాలా? మండిపడ్డ సుప్రీంకోర్టు...

జూనియర్ అధికారిణితో న్యాయమూర్తి సరసాలకు పాల్పడటం ఆమోదయోగ్యకరమైన ప్రవర్తన కాదని సుప్రీంకోర్టు తాజాగా వ్యాఖ్యానించింది. ఈ కేసులో బాధితురాలు పిటిషన్ ను ఉపసంహరించుకున్నా సదరు న్యాయమూర్తి అంతర్గత విచారణ నుంచి తప్పించుకోలేరని స్పష్టం చేసింది. 

supreme court fires on high court retired judge over sexuval harassment alligations - bsb
Author
Hyderabad, First Published Feb 17, 2021, 1:13 PM IST

జూనియర్ అధికారిణితో న్యాయమూర్తి సరసాలకు పాల్పడటం ఆమోదయోగ్యకరమైన ప్రవర్తన కాదని సుప్రీంకోర్టు తాజాగా వ్యాఖ్యానించింది. ఈ కేసులో బాధితురాలు పిటిషన్ ను ఉపసంహరించుకున్నా సదరు న్యాయమూర్తి అంతర్గత విచారణ నుంచి తప్పించుకోలేరని స్పష్టం చేసింది. 

మధ్యప్రదేశ్ లోని ఓ జిల్లా న్యాయమూర్తి.. ఇప్పుడు ఆయన రిటైరయ్యారు.. తనను లైంగికంగా వేధించారంటూ జూనియర్ న్యాయాధికారిణి ఒకరు ఫిర్యాదు చేశారు. దీనిపై మధ్యప్రదేశ్ హైకోర్టు అంతర్గత విచారణకు ఆదేశించింది. 

అయితే ఈ కేసు మీద స్పందించిన సదరు రిటైర్డ్ జడ్జ్ స్పందించారు. తనపై విచారణను నిలిపివేయాలని, తాను హైకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందకూడదనే దురుద్దేశంతోనే ఆరోపణలు చేశారంటూ సదరు విశ్రాంత న్యాయమూర్తి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. 

ఈ పిటిషన్ పై సుప్రీంకోర్ట్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్.ఎ.బోబ్దే నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది. ‘ఆరోపణలు ఎదుర్కొంటున్న విశ్రాంత జిల్లా న్యాయమూర్తి అనుచితమైన, అసహ్యకరమై వాట్సప్ సందేశాలు పంపారు. జూనియర్ అధికారిణితో సరసాలకు పాల్పడటం జడ్జిలకు తగదు. హైకోర్టు నిర్ణయం మేరకు ఆయన అంతర్గత విచారణను ఎదుర్కోవాల్సిందే’ అని సూచించింది. 

Follow Us:
Download App:
  • android
  • ios