Asianet News TeluguAsianet News Telugu

మతం పేరుతో మనం ఎక్కడికి చేరుకున్నాం.. విద్వేషపూరిత ప్రసంగంపై సుప్రీంకోర్టు ఆందోళన.. 

ద్వేషపూరిత ప్రసంగాల విషయంలో సుప్రీం కోర్టు సిరీయస్ అయ్యింది. ఢిల్లీ, యూపీ, ఉత్తరాఖండ్ పోలీసులకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. వారి అధికార పరిధిలో ఇటువంటి నేరాలపై తీసుకున్న చర్యలపై నివేదికను సమర్పించాలని కోరింది. అధికారిక ఫిర్యాదు కోసం ఎదురుచూడకుండా ద్వేషపూరిత ప్రసంగాల కేసులను సుమోటాగా స్వీకరించాలని రాష్ట్ర ప్రభుత్వాలు, పోలీసు అధికారులను సుప్రీం  ఆదేశించింది.
 

Supreme Court Expresses Concern Over Hate Speeches Observes
Author
First Published Oct 22, 2022, 12:42 AM IST

విద్వేషపూరిత ప్రసంగాల విషయంలో సుప్రీం కోర్టు కఠిన వైఖరి తీసుకుంది.విద్వేషపూరిత ప్రసంగాలు చేసిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోర్టు ఆదేశించింది. దేశంలో విద్వేషపూరిత ప్రసంగాల ఘటనలపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. మతం పేరుతో ఎక్కడికి చేరుకున్నామని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇటువంటి ప్రకటనలు (ద్వేషపూరిత ప్రసంగాలు) ఆందోళన కలిగిస్తాయనీ,ముఖ్యంగా ప్రజాస్వామ్య దేశంలో ప్రభుత్వాలు మతం విషయంలో తటస్థ వైఖరిని ప్రదర్శించాలని సుప్రీం కోర్టు సూచించింది.
 
భారతదేశంలోని ముస్లిం సమాజాన్ని లక్ష్యంగా చేసుకుని, భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆరోపిస్తున్న ఆరోపణను ఆపేందుకు తక్షణ జోక్యం చేసుకోవాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ జరుపుతోంది. ఈ క్రమంలో ఢిల్లీ, యూపీ, ఉత్తరాఖండ్ పోలీసులకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది.  వారి అధికార పరిధిలో ఇటువంటి నేరాలపై తీసుకున్న చర్యలపై నివేదికను సమర్పించాలని ఆదేశించింది. అధికారిక ఫిర్యాదు కోసం ఎదురుచూడకుండా ద్వేషపూరిత ప్రసంగాల కేసులను సుమోటా స్వీకరించాలని రాష్ట్ర ప్రభుత్వాలు, పోలీసు అధికారులను సుప్రీం కోర్టు ఆదేశించింది. తప్పు చేసిన అధికారులపై చర్యలు తీసుకోకపోతే కోర్టు ధిక్కారం కిందకు వస్తుందని సుప్రీంకోర్టు పేర్కొంది.

మతంతో సంబంధం లేకుండా చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు పేర్కొంది. దేశంలో ద్వేషపూరిత వాతావరణం నెలకొందనీ, ఇలాంటి ప్రకటనలు కలకలం రేపుతున్నాయనీ.. ఇలాంటి పరిస్థితులను ఊపేక్ష్ించడం సరికాదని జస్టిస్ కేఎం జోసెఫ్ ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. 21వ శతాబ్దంలో ఏం జరుగుతోంది? మతం పేరుతో ఎక్కడికి చేరుకున్నాం? దేవుడిని ఎంత చిన్నగా చేసాము?అని ప్రశ్నించింది. భారత రాజ్యాంగం శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించడం గురించి మాట్లాడుతుందని ధర్మాసనం పేర్కొంది.

భారత్‌లో ముస్లింలపై పెరుగుతున్న అఘాయిత్యాలను అరికట్టేందుకు తక్షణ జోక్యం చేసుకోవాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను ధర్మాసనం విచారించింది.పిటిషనర్ తరపున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ తన వాదనలను వినిపించారు. ఈ విషయంలో  తాము  కోర్టుకు రాకూడదని అనుకున్నమనీ, అయితే చాలా ఫిర్యాదులు చేశామని కోర్టుకు తెలిపారు. అధికారులు, ప్రభుత్వాలు  ఎప్పుడూ చర్యలు తీసుకోలేదని తెలిపారు. వెంటనే ఈ సమస్యను పరిష్కరించాలని, విద్వేష ప్రసంగాలు, విద్వేష నేరాలకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఇలాంటి నేరాలను అరికట్టడానికి యూఏపీఏ వంటి కఠిన చట్టాలను ప్రయోగించాలని పిటిషనర్ కోరారు.దేశవ్యాప్తంగా జరిగిన విద్వేష పూరిత ప్రసంగాలపై స్వతంత్ర, విశ్వసనీయ, నిష్పక్షపాత విచారణ చేపట్టాలని పిటిషనర్ పేర్కొన్నారు.

ఈ విచారణ సందర్భంగా ఇటీవలే ఢిల్లీలో నిర్వహించిన హిందూసభలో బీజేపీ ఎంపీ పర్వేశ్ వర్మ సంచలన 
ప్రసంగాన్ని న్యాయవాది కపిల్ సిబల్ ప్రస్తావించారు. ముస్లింలను పూర్తిగా బాయ్‌కాట్ చేయాలని,
వారి దుకాణంలో ఎలాంటి కొనుగోలు చేయకూడదని సంచలన వ్యాఖ్యలు చేశారు.  ఇలాంటి కేసులపై అనేక ఫిర్యాదులు లేవనెత్తినప్పటికీ, స్టేటస్ రిపోర్టు అడగడం మినహా పరిపాలన, సుప్రీంకోర్టు కూడా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని సిబల్ ఎత్తిచూపారు. 

జస్టిస్ హృషికేశ్ రాయ్ మాట్లాడుతూ.. ఇలాంటి ప్రకటనలు చాలా బాధ కలిగిస్తున్నాయన్నారు.మన ప్రజాస్వామ్య దేశమని, మత విషయంలో తటస్థ వైఖరిని ప్రదర్శించాలని అన్నారు. విద్వేష పూరిత ఘటనలపై చర్య తీసుకోవాలని అన్నారు. అయితే, కేవలం ఒక వర్గానికి వ్యతిరేకంగా చేసిన ప్రకటనలను కోర్టు దృష్టికి తీసుకువెళ్లామని, సుప్రీం కోర్టును ఎవరినీ లక్ష్యంగా చేసుకునే సంస్థగా చూడలేమని ఆయన సూచించారు. ఎవరైనా ఇలాంటి ప్రకటనలు చేయడం ఖండించదగినది అని ఆయన అన్నారు.

దేశ ఐక్యత, సమగ్రత ఉపోద్ఘాతంలో పొందుపరచబడిన మార్గదర్శక సూత్రాలలో ఒకటి . భిన్న మతాలకు చెందిన సమాజంలోని సభ్యులు సామరస్యంగా జీవించగలిగితే.. తప్ప సోదరభావం ఉండదనీ, వివిధ శిక్షాస్మృతి నిబంధనలు ఉన్నప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని, రాజ్యాంగ సూత్రాలను పాటించాల్సిన అవసరం ఉందని పిటిషనర్‌ ఎత్తిచూపారు. ద్వేషపూరిత నేరాలు, ప్రసంగాల సంఘటనలపై స్వతంత్ర,నిష్పక్షపాత దర్యాప్తు ప్రారంభించాలని, చట్టవిరుద్ధమైన కార్యకలాపాల నిరోధక చట్టం, ఇతర సంబంధిత చట్టాల ప్రకారం అలాంటి చర్యలకు పాల్పడే వారిపై చర్యలు తీసుకోవాలని  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించాలని పిటిషనర్ కోరారు 

ప్రాథమిక హక్కులను పరిరక్షించడంతోపాటు  రాజ్యాంగాన్ని పరిరక్షించడాన్నికోర్టు బాధ్యతగా భావిస్తున్నట్లు తాను భావిస్తున్నమని అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది.

Follow Us:
Download App:
  • android
  • ios