Asianet News TeluguAsianet News Telugu

ఆ బాధ్యత యాంకర్లదే .. విద్వేష పూరిత ప్రసంగాల ప్రసారాలపై సుప్రీంకోర్టు ఆగ్రహం

వివిధ టెలివిజన్ ఛానెళ్లలో ప్రసారమవుతున్న విద్వేషపూరిత ప్రసంగాలపై సుప్రీం కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ విషయంలో కేంద్రప్రభుత్వం మౌనంగా ఎందుకు ఉంటుందని ప్రశ్నించింది
 

Supreme Court condemns hate speech aired on TV
Author
First Published Sep 22, 2022, 6:09 AM IST

విద్వేష పూరిత ప్రసంగాల ప్రసార విషయంపై సుప్రీంకోర్టు టీవీ ఛానెళ్లను తీవ్రంగా మందలించింది.చానళ్లలో చర్చ హద్దుల్లేకుండా పోయిందని కోర్టు పేర్కొంది. ద్వేషపూరిత వ్యాఖ్యలను ఆపడం యాంకర్ బాధ్యతేననీ, కానీ.. వారు ఆపడం లేదని అసంతప్తి వ్యక్తం చేసింది. విద్వేష ప్రసంగాల విషయంలో కేంద్రం మౌనంగా ఎందుకు ఉంటోందని ప్రశ్నించింది. 

లా కమిషన్ సిఫార్సుల ప్రకారం చట్టాలను రూపొందించాలని కేంద్రం ఉద్దేశించిందా?అని సుప్రీంకోర్టు బుధవారం కోరింది. లేదా? విజువల్ మీడియా ప్రజలపై తీవ్ర ప్రభావాన్ని చూపిందని, నేటీకాలంలో ప్రజలు వార్తాపత్రికలను చదవడానికి సమయం వెచ్చించడం లేదనీ, వార్తాపత్రికలలో ఏమి వ్రాసినా ఎవరూ పట్టించుకోరని కోర్టు పేర్కొంది.

టీవీ చర్చల సమయంలో యాంకర్ల పాత్రను కోర్టు ప్రస్తావిస్తూ..ఏదైనా అంశాన్ని చర్చించేటప్పుడు ద్వేషపూరిత ప్రసంగాలను ఆపడం యాంకర్ల బాధ్యత అని పేర్కొంది. ద్వేషపూరిత ప్రసంగాలను ఎదుర్కోవడానికి సంస్థాగత యంత్రాంగాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని జస్టిస్ ఎం. జోసెఫ్, హృషికేష్ రాయ్‌లతో కూడిన ధర్మాసనం పేర్కొంది. న్యాయవాది అశ్వినీ కుమార్ ఉపాధ్యాయ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాలను విచారించిన ధర్మాసనం చానెళ్లతో సహా మీడియా పాత్రను పరిగణనలోకి తీసుకుంది. ఈ కేసు ఇప్పుడు నవంబర్ 23న విచారణకు రానుంది.

రాజకీయ పార్టీలు వస్తుంటాయి, పోతుంటాయి, కానీ దేశంలోని సంస్థ, పత్రికా స్వేచ్ఛ చెక్కుచెదరకుండా ఉంటాయని పేర్కొంది. దేశం ఎటు వెళ్తోందని కేంద్రాన్ని ధర్మాసనం ప్రశ్నించింది. మీరు దీన్ని సాధారణ సమస్యగా ఎందుకు తీసుకుంటున్నారు? ద్వేషపూరిత ప్రసంగాలు, ప్రసారాలు  దేశాన్ని విషపూరితం చేస్తాయని, వాటిని ఎట్టి పరిస్థితుల్లో అనుమతించకూడదని కోర్టు పేర్కొంది.

ద్వేషపూరిత ప్రసంగాలు, పుకార్లను వ్యాప్తి చేస్తున్న పిటిషన్లలో ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, నేషనల్ అసోసియేషన్ ఆఫ్ బ్రాడ్‌కాస్టర్స్ (NBA)లను పార్టీలుగా చేర్చడానికి బెంచ్ నిరాకరించింది.ద్వేషపూరిత ప్రసంగాలను అరికట్టేందుకు నియంత్రణ యంత్రాంగం అవసరమని సుప్రీంకోర్టు నొక్కి చెప్పింది. 

ద్వేషపూరిత ప్రసంగాల అంశంపై విశాఖ, తహసీన్ పూనావల్ల కేసుల్లో గత తీర్పులను ప్రస్తావిస్తూ..కేంద్రం స్పందనను పరిగణనలోకి తీసుకున్న తర్వాత టీవీ ఛానెల్‌లకు కొన్ని మార్గదర్శకాలను రూపొందించవచ్చని సుప్రీంకోర్టు పేర్కొంది. కేంద్ర ప్రభుత్వం ఈ అంశాన్ని నిరసనగా తీసుకోవద్దని, చట్టం తీసుకురావడానికి అవకాశంగా తీసుకోవాలని ధర్మాసనం పేర్కొంది.

మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కనీసం యాంకర్ పాత్ర ఎంతో కీలకమని బెంచ్ పేర్కొంది. ఎవరైనా ద్వేషపూరిత వ్యాఖ్య చేయడానికి ప్రయత్నిస్తే, వెంటనే దాన్ని ఆపడం యాంకర్ విధి అనీ, భావప్రకటన స్వేచ్ఛలో ప్రేక్షకుల హక్కు కూడా ఉందని ధర్మాసనం పేర్కొంది. సంస్థాగత ఏర్పాట్లు జరిగే వరకు.. ప్రజలు ఇలాగే నడుస్తూనే ఉంటారు. మనకు సరైన చట్టపరమైన ఫ్రేమ్‌వర్క్ రూపొందించాలని కోర్టు పేర్కొంది.

"న్యాయమైన,  వాస్తవిక రిపోర్టింగ్ సమస్య కాదు" అని బెంచ్ పేర్కొంది. ప్రసారాలు, కార్యక్రమాలు ఇతరులను రెచ్చగొట్టడానికి ఉపయోగించినప్పుడు సమస్య తలెత్తుతుందని తెలిపింది. టీవీ న్యూస్ ఛానల్స్ ద్వారా గానీ, సోషల్ మీడియా ద్వారా గానీ విద్వేషపూరిత ప్రసంగాలు వ్యాప్తి చెందుతున్నాయని బెంచ్ పేర్కొంది.  
 
ఈ అంశంపై రెండు వారాల్లోగా స్పందన తెలియజేయాలని కేంద్రాన్ని అత్యున్నత న్యాయస్థానం కోరింది. ద్వేషపూరిత ప్రసంగాలను నియంత్రించేందుకు ఏదైనా చట్టాన్ని పరిశీలిస్తున్నారా అని ధర్మాసనం ప్రశ్నించింది. ఈ అంశంపై 14 రాష్ట్రాల నుంచి మాత్రమే స్పందన వచ్చిందని కేంద్రం తెలిపింది.

Follow Us:
Download App:
  • android
  • ios