న్యూఢిల్లీ: దేశంలోని అన్ని రాష్ట్రాల్లో కరోనా నిర్ధారణ పరీక్షల ధరలు ఒకేలా ఉండాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. కొన్ని రాష్ట్రాల తక్కువ ధరకే కరోనా పరీక్షలు చేసేలా ఉత్తర్వులు తేవడాన్ని స్వాగతిస్తున్నామని సుప్రీంకోర్టు తెలిపింది.

కరోనా రోగులకు చికిత్స అందిస్తున్న వార్డుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేలా ఆదేశాలు ఇస్తామని సుప్రీంకోర్టు పేర్కొంది. కరోనా రోగుల చికిత్స, కరోనా మృతదేహాల అంత్యక్రియల నిర్వహణ తీరుపై సుప్రీంకోర్టులో శుక్రవారం నాడు విచారణ జరిగింది.

also read:24 గంటల్లో ఇండియాలో 13,586 కరోనా కేసులు: కోవిడ్‌తో12,573 మంది మృతి

జస్టిస్ ఆశోక్ భూషణ్ నేతృత్వంలోని  ధర్మాసనం ఈ తీర్పు చెప్పింది.  కొన్ని రాష్ట్రాల్లో కరోనా నిర్ధారణ పరీక్షలకు రూ. 2200 వసూలు చేస్తుండగా, మరికొన్ని రాష్ట్రాల్లో రూ. 4500  వసూలు చేస్తున్న విషయాన్ని ప్రభుత్వం సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లింది.

తెలంగాణ రాష్ట్రంలో కరోనా నిర్ధారణ పరీక్షలకు రూ.2200గా నిర్ధారించారు. యూపీ ప్రభుత్వం కరోనా పరీక్షలకు గాను రూ.2500పైగా వసూలు చేస్తోంది.మహారాష్ట్రలో రూ.4500 ల నుండి రూ. 2500లకు తగ్గించారు.

దేశంలో కరోనా కేసులు 3,80,532కి చేరుకొన్నాయి. ఇందులో  1,63,248 యాక్టివ్ కేసులని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. గత 24 గంటల్లో 13,586 కేసులు నమోదయ్యాయి.