న్యూఢిల్లీ: విమాన ప్రమాదంలో మరణించిన ప్రయాణీకుడి కుటుంబానికి రూ.7.64 కోట్లను పరిహారంగా చెల్లించాలని సుప్రీంకోర్టు ఎయిరిండియాను ఆదేశించింది. 2010లో జరిగిన ప్రమాదంపై సుప్రీంకోర్టు ఈ తీర్పు వెలువరించింది.

2010లో మంగుళూరులో విమాన ప్రమాదం చోటు చేసుకొంది.దుబాయ్ నుండి 166 మంది ప్రయాణీకులతో వచ్చిన ఎయిరిండియా విమానం ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో 158 మంది మరణించారు. 

మృతుల్లో యూఏఈకి చెందిన ఓ సంస్థ రీజినల్ డైరెక్టర్ మహేంద్ర కొడ్కనీ ఉన్నారు. కొడ్కనీ కుటుంబానికి రూ. 7.35 కోట్లను పరిహారంగా చెల్లించాలని వినియోగదారుల వివాద పరిష్కార కమిషన్ అప్పట్లో ఎయిరిండియాను ఆదేశించింది. అయితే ఈ పరిహారాన్ని ఎయిరిండియా బాధిత కుటుంబానికి చెల్లించలేదు. అంతేకాదు పలు కారణాలను చూపింది.

also read:కనిష్టం రూ. 3,500, గరిష్టం రూ. 10 వేలు: కొత్త విమాన ఛార్జీలు ఇవే

పరిహారం చెల్లించకపోవడంపై మృతుడి కుటుంబం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్ ను గురువారం నాడు సుప్రీంకోర్టు విచారించింది. ఎన్ సీడీఆర్సీ  పేర్కొన్నట్టుగా రూ. 7.35 కోట్ల పరిహారంంలో ఇప్పటివరకు చెల్లించని మొత్తానికి ఏడాదికి 9 శాతం వడ్డీ కలిపి చెల్లించాలని ఆదేశించింది. 

ఒక ఉద్యోగికి ఉన్న స్థాయి ఆధారంగా అతని ఆదాయాన్ని అంచనా వేయాలి. అతని మరణంతో సంభవించిన నష్టాన్ని నిర్ణయం తీసుకొనే సమయంలో అతని అర్హతలను పరిగణనలోకి తీసుకోవాలని సుప్రీంకోర్టు సూచించింది.