Asianet News TeluguAsianet News Telugu

నేర చరిత వున్న నేతలకు ఇక మూడినట్లే: సుప్రీం కీలక ఆదేశాలు

నేర చరిత్ర వున్న నేతల కేసుల విషయంలో సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసింది. నేరచరిత్ర వున్న నేతల కేసుల పరిష్కారానికి వారం రోజుల్లో యాక్షన్ ప్లాన్ ఇవ్వాలని దేశంలోని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులను సుప్రీం ఆదేశించింది

supreme Court Asks HCs to Review All Cases Where Trials Against MPs, MLAs Have Been Stayed
Author
New Delhi, First Published Sep 17, 2020, 9:16 PM IST

నేర చరిత్ర వున్న నేతల కేసుల విషయంలో సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసింది. నేరచరిత్ర వున్న నేతల కేసుల పరిష్కారానికి వారం రోజుల్లో యాక్షన్ ప్లాన్ ఇవ్వాలని దేశంలోని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులను సుప్రీం ఆదేశించింది.

9 అంశాలను యాక్షన్ ప్లాన్‌లో చేర్చాలని అత్యున్నత న్యాయస్థానం వివరించింది. ప్రతి జిల్లాలోని పెండింగ్ కేసులు, ప్రత్యేక కోర్టుల సంఖ్య, అందుబాటులో ఉన్న కోర్టులు, జడ్జిల సంఖ్య, పదవీకాలం, ప్రతి న్యాయమూర్తి ఎన్ని కేసులు పరిష్కరించగలరో, వాటి పరిష్కారానికి పట్టే సమయాన్ని పొందుపర్చాలని సుప్రీం స్పష్టం చేసింది.

కోర్టుల మధ్య దూరం, మౌలిక సదుపాయాలను కూడా యాక్షన్ ప్లాన్‌లో చేర్చాలని సూచించింది. స్టే ఉన్న కేసులను కూడా 2 నెలల్లో కొలిక్కి తీసుకురావాలని సుప్రీం పేర్కొంది.

హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి పర్యవేక్షణలో కేసుల పురోగతి, అమికస్ క్యూరీ ఇచ్చిన సిఫార్సులపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు సూచనలు, సలహాలు ఇవ్వాలని కోరింది. అమికస్ క్యూరీకి ఈ మెయిల్ ద్వారా యాక్షన్ ప్లాన్ పంపాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.

Follow Us:
Download App:
  • android
  • ios