శివసేన రెబెల్ ఎమ్మెల్యేలు దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టు ఇవాళ విచారణ నిర్వహించింది. డిప్యూటీ స్పీకర్ నిర్ణయాన్ని షిండే వర్గం సవాల్ చేసింది. అయితే ఈ విషయమై శివసేన తరపున న్యాయవాదులు కూడా తమ వాదనలను విన్పించారు. ఈ కేసు విచారణను జూలై 11 వ తేదీకి వాయిదా వేసింది ఉన్నత న్యాయస్థానం
ముంబై: తమకు మద్దతిస్తున్న 16 మంది MLAలకు డిప్యూటీ స్పీకర్ అనర్హత నోటీసుకు వ్యతిరేకంగా Eknath Shindeవర్గం దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టు సోమవారం నాడు విచారణ నిర్వహించింది. ఈ విషయమై మహారాష్ట్ర శాసనసభ సెక్రటరీ, డిప్యూటీ స్పీకర్ , కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఉన్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది.
Shiv senaలో చోటు చేసుకొన్న సంక్షోభం నేపథ్యంలో Deputy Speaker నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఏక్‌నాథ్ షిండే వర్గం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ పై ఇరువర్గాలు తమ వాదనలు విన్పించారు.
మరో వైపు శివసేన నేతలు అజయ్ చౌదరి, సునీల్ ప్రభులకు కూడా Supreme Court నోటీసులు జారీ చేసింది. ఐదు రోజుల్లోపుగా సమాధానం ఇవ్వాలని కూడా ఆదేశాలు జారీ చేసింది. ఈ పిటిషన్ ను ఈ ఏడాది జూలై 11న విచారిస్తామని సుప్రీంకోర్టు తెలిపింది.
ఎలాంటి కారణం చూపకుండానే సీఎంపై విశ్వాసం లేదని ఎలా చెబుతారని కూడా సుప్రీంకోర్టు రెబెల్ ఎమ్మెల్యేలను ప్రశ్నించింది. డిప్యూటీ స్పీకర్ తరపున రాజీవ్ ధావన్, శివసేన కొత్త గ్రూప్ లీడర్ గా ఎన్నికైన అజయ్ చౌదరి, సునీల్ ప్రభుల తరపున ఆయన తరపు న్యాయవాది సింఘ్వి నోటీసులు తీసుకున్నారు. సోలిసిటర్ జనరల్ కేంద్రం తరపున నోటీసును తీసుకున్నారు. కౌంటర అఫిడవిట్లు ఐదు రోజుల్లో దాఖలు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అఫిడవిట్లు దాఖలు చేసిన మూడు రోజుల్లోపుగా రిజాయిండర్లు దాఖలు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.
also read:38 మంది ఎమ్మెల్యేల మద్దతు వెనక్కి.. మెజారిటీ కోల్పోయిన మహారాష్ట్ర సర్కారు : శివసేన రెబల్స్
అనర్హత నోటీసులపై స్పందించేందుకు తిరుగుబాటు ఎమ్మెల్యేలకు ఇచ్చిన గడువును సుప్రీంకోర్టు జూలై 12కి పొడిగించింది. ముందుగా ఇవాళ సాయంత్రం ఐదున్నర గంటలలోపుగా సమాధానాలు ఇవ్వాలని కోరింది.డిప్యూటీ స్పీకర్ ఇచ్చిన నోటీసుపై సుప్రీంకోర్టు స్టేటస్ కో ఇచ్చింది. జూలై 11 వ తేదీ వరకు రెబెల్ ఎమ్మెల్యేలపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని కూడా ఆదేశాలు జారీ చేసింది. ఈ విషయమై డిప్యూటీ స్పీకర్, అసెంబ్లీ సెక్రటరీకి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఐదు రోజుల్లో కౌంటర్ దాఖలు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
ముంబై కోర్టును ఎందుకు ఆశ్రయించలేదని రెబెల్ ఎమ్మెల్యేల తరపు న్యాయవాదిని సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది. దీనికి న్యాయవాది ఎస్ కె కౌల్ బదులిచ్చారు. తిరుగుబాటుదారుల ఇళ్లు, ఆస్తులకు ముప్పు పొంచి ఉందన్నారు. వారు ముంబైలో తమ హక్కును సాధించుకొనే పరిస్థితి లేదన్నారు.
తనకు మద్దతిస్తున్న ఎమ్మెల్యేల ప్రాణాలకు తీవ్రమైన ముప్పు పొంచి ఉందని ఏక్ నాథ్ షిండే వర్గం సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ లో పేర్కొంది. శివసేన అధికార ప్రతినిధి సంజయ్ రౌత్ చేసిన మృతదేహాలు అనే వ్యాఖ్యలను కూడా షిండే వర్గం పిటిషన్ లో ప్రస్తావించింది.
అనర్మథ వేటు వేసిన ఎమ్మెల్యేలకు తగిన భద్రత కల్పించేందుకు తక్షణమే చర్యలు తీసుకొంటామని మహారాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది.55 మంది శివసేన ఎమ్మెల్యేలలో 38 మంది సంకీర్ణానికి మద్దతు ఉపసంహరించుకోవడంతో మహారాష్ట్రలోని మహారాష్ట్ర వికాన్ అఘాడీ కూటమి సభలో మెజారిటీని కోల్పోయిందని షిండే వర్గం ఆ పిటిషన్ లో పేర్కొంది.
రాజకీయ గందరగోళానికి కారణమైన ఏక్ నాథ్ షిండే, ఇతర తిరుగుబాటు ఎమ్మెల్యేలపై ఇవాళ కొందరు ముంబై కోర్టులో పిల్ దాఖలు చేశారు. రెబెల్ ఎమ్మెల్యేలు ముంబైకి వచ్చి తిరిగి విధుల్లో చేరేలా ఆదేశించాలని హైకోర్టును పిల్ లో కోరారు.
