Asianet News TeluguAsianet News Telugu

కాంగ్రెస్‌కు షాక్: కోడ్ ఉల్లంఘనపై మోడీ, షాలకు సుప్రీం క్లీన్ చిట్

ఎన్నికల కోడ్ ఉల్లంఘన వ్యవహారంలో ప్రధాని నరేంద్రమోడీ, బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షాలకు సుప్రీంకోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది

Supreme copurt clean chits to PM Narendra Modi and Amit Shah over violation of Model Code of Conduct
Author
New Delhi, First Published May 8, 2019, 12:22 PM IST

ఎన్నికల కోడ్ ఉల్లంఘన వ్యవహారంలో ప్రధాని నరేంద్రమోడీ, బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షాలకు సుప్రీంకోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది. అమిత్ షా, మోడీలు ఎన్నికల కోడ్ ‌ఉల్లంఘన ఉదంతానికి సంబంధించి ఎన్నికల సంఘం ఎలాంటి చర్యలు తీసుకోలేదంటూ కాంగ్రెస్ ఎంపీ సుస్మితా దేవ్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు.

దీనిపై బుధవారం విచారణ జరిపిని అత్యున్నత న్యాయస్థానం.. సుస్మితా దేవ్ పిటిషన్‌ను తోసిపుచ్చింది. ఈసీ నిర్ణయాల్లో తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసిన సుప్రీం.. మరోసారి నిర్ధిష్టంగా పిటిషన్ దాఖలు చేయాలని సూచించింది.

కాగా, మోడీ, షా కోడ్ ఉల్లంఘనకు సంబంధించి ఈ నెల 2వ తేదీ సుప్రీం విచారించిన సంగతి తెలిసిందే.  ఫిర్యాదులపై ఈ నెల 6వ తేదీ లోపు నిర్ణయం తీసుకోవాల్సిందిగా ఈసీని ఆదేశించింది.

అయితే ఈ నెల 8 వరకు సమయం కావాలని ఎన్నికల సంఘం కోర్టును కోరింది. ఇప్పటికే రెండు ఫిర్యాదులపై నిర్ణయం తీసుకున్నామని.. మరో తొమ్మిది ఫిర్యాదులపై నిర్ణయం తీసుకోవాల్సి ఉందని ఈసీ వెల్లడించింది. 

Follow Us:
Download App:
  • android
  • ios