నా భార్య, ఆమె ప్రియుడు మరింత స్వేచ్ఛగా విహరించేందుకు కోర్టు అవకాశమిచ్చింది’ అని ఆవ్యక్తి వాపోయారు. తన భార్యకు ఒకటికి మించి సంబంధాలున్నాయని... దీనికి సంబంధించి ఆధారాలన్నీ సేకరించిన తర్వాత ‘ఇది తప్పే కాదు’ అని సుప్రీంకోర్టు తీర్పు చెప్పిందని మరో వ్యక్తి ఆక్రోశించారు.
వివాహేతర సంబంధం నేరం కాదు.. అంటూ సుప్రీం కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. స్త్రీ స్వేచ్ఛ, సమానత్వం, లైంగిక హక్కులను సమర్థిస్తూ.. న్యాయస్థానం ఈ విధంగా తీర్పు వెలువరిచింది. కోర్టు తీర్పు బాగానే ఉంది.. కానీ దీని వల్ల నిజంగా ఆడవాళ్లకు ప్రయోజనం కలుగుతుందా..? స్త్రీలను సమర్థాస్తున్నామంటూ కోర్టు ఇచ్చిన తీర్పు.. పురుషులకు అనువుగా మారే అవకాశమే ఎక్కువగా ఉంది అనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.
సెక్షన్ 497 ఐపీసీని రద్దు చేస్తూ సుప్రీంకోర్టు చెప్పిన తీర్పుపై భర్తల నుంచి మిశ్రమ స్పందన లభిస్తోంది. వివాహేతర సంబంధాల్లో సుప్రీంకోర్టు చూడని కోణాలేన్నో వారి కథనాల్లో బయటపడుతున్నాయి. ఈ తీర్పు ‘తప్పు’ చేసే మగాళ్లకు ఊరటనిస్తోందని... తాను నిజాయితీగా ఉంటూ, తన భార్య కూడా అలాగే ఉండాలని ఆకాంక్షించే వారికి శరాఘాతమనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
ఉదాహరణకు... బెంగళూరుకు చెందిన ఓ వ్యక్తికి కోర్టు తీర్పుతో తీరని అన్యాయం జరిగింది. సెక్షన్ 497 ప్రకారం వివాహేతర బంధం పెట్టుకున్న భర్తపై భార్య మాత్రమే కేసు పెట్టగలదు. కాగా అతని భార్య పెళ్లి తర్వాత కూడా తన పాత ప్రియుడితో కలిసి తిరుగుతోంది. ఆమెపై నేరుగా తాను నేరుగా కేసు పెట్టలేడు కాబట్టి... ప్రియుడి భార్య ద్వారా ఫిర్యాదు చేయించాలని భావించారు. భార్య, ఆమె ప్రియుడి సంబంధంపై రెండేళ్లు కష్టపడి పకడ్బందీ ఆధారాలు సంపాదించారు. తీరా చూస్తే... ‘వివాహేతర సంబంధం నేరం కాదు’ అని సుప్రీంకోర్టు తీర్పు చెప్పేసింది. ‘‘నా భార్య, ఆమె ప్రియుడు మరింత స్వేచ్ఛగా విహరించేందుకు కోర్టు అవకాశమిచ్చింది’ అని ఆవ్యక్తి వాపోయారు. తన భార్యకు ఒకటికి మించి సంబంధాలున్నాయని... దీనికి సంబంధించి ఆధారాలన్నీ సేకరించిన తర్వాత ‘ఇది తప్పే కాదు’ అని సుప్రీంకోర్టు తీర్పు చెప్పిందని మరో వ్యక్తి ఆక్రోశించారు.
అంతేకాదు.. తప్పు చేసే మగవాళ్ల కు ఈ తీర్పు మరింత అనువుగా మారనుంది. ఇష్టపూర్వంగా పర స్త్రీతో వివాహేతర సంబంధం పెట్టుకుంటే తన భార్యకి అన్యాయం చేసినట్టే అవుతుంది కదా..అని కొందరు భార్యలు వాపోతున్నారు.
