కర్ణాటక నాట రాజకీయాలు రోజురోజుకీ రసవత్తరంగా మారుతున్నాయి. ఇటీవల కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. కాగా... ఆ ఎమ్మెల్యేలకు కార్యకర్తలు ఊహించని షాక్ ఇచ్చారు.

బెంగళూరు ఉత్తర జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాజ్‌కుమార్‌ నేతృత్వంలో కేపీసీసీ కార్యాలయం వద్ద కార్యకర్తలు నిరసన తెలిపారు. ప్లకార్డులు ప్రదర్శించి నినాదాలు చేశారు. రాజీనామా వీడి పార్టీకి అండగా నిలవాలని కోరారు. నాయకులకు కార్యకర్తలంతా అండగా నిలుస్తామన్నారు. రాజీనామాల ఆలోచన విధానాన్ని విడనాడాలని వారు కోరారు. ఈ సందర్భంగా బీబీఎంపీ అధికా రపక్షనేత అబ్దుల్‌ వాజిద్‌, తదితరులు పాల్గొన్నారు.