Super Tech Twin Towers | నొయిడా పరిధిలోని సూపర్‌టెక్ ట్విన్ టవర్స్ ను కూల్చివేయాలనే సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు రంగం సిద్దమయ్యింది. ఈ క్రమంలో ఆదివారం టెస్ట్ బ్లాస్టింగ్ జరుగనున్నది. దీంతో ఆ పరిధిలో ప్రజలు ఆదివారం తమ ఇండ్ల నుంచి బయటకు రావద్దని నొయిడా అధారిటీ అధికారులు ప్రకటించారు.
Supertech Twin Towers: నొయిడా పరిధిలోని సెక్టార్ 93-ఎలో సూపర్‌టెక్ ట్విన్ టవర్స్ కూల్చివేతకు మూహర్తం ఖరారు అయ్యింది. వచ్చేనెల 22న ఈ టవర్స్ కూల్చివేయాలని సుప్రీం ఆదేశించింది. ఈ మేరకు వాటి కూల్చివేతకు ఎంత మొత్తం పేలుడు పదార్థాలు అవసరం అవుతాయో అంచనావేసేందుకు నొయిడా అధారిటీ అధికారులు ఆదివారం టెస్ట్ బ్లాస్టింగ్ ద్వారా పరీక్షించనున్నారు. ఈ బ్లాస్టింగ్ పనులను ఎడిఫైస్ ఇంజినీరింగ్, జెట్ డెమోలిషన్స్ వారు నిర్వహించనున్నారు.
ఆదివారం ఉదయం 8 గంటల నుంచి బ్లాస్టింగ్ పనులు జరగనున్నాయి. మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో నొయిడా సెక్టార్ 93-ఏ సెక్టార్ పరిధిలోని ఈ టవర్స్‌ను ప్రయోగాత్మకంగా పేలుస్తారు. కనుక ఆ సయమంలో టవర్స్ చుట్టుపక్కల నివసించే వారు ఇండ్ల నుంచి బయటకు రావద్దని అధికారులు తెలిపారు. ఆదివారం మధ్యాహ్నం 2.15 గంటల నుంచి 2.45 గంటల వరకు ట్రయల్ బ్లాస్టింగ్ జరుగనున్నది. దీంతో ఈ జోన్ పరిధిలోని అపార్ట్‌మెంట్లలో నివాసం ఉంటున్న వారు ఇంటి బయటకు రావొద్దని, కనీసం బాల్కానీల్లో కూడా నిలబడరాదని ఆదేశించారు.
కూల్చివేత ప్రక్రియ గురించి ఎడిఫైస్ ఇంజినీరింగ్ భాగస్వామి ఉత్కర్ష్ మెహతా మాట్లాడుతూ.. బేస్‌మెంట్ అంతస్తులో ఆరు బ్లాకులు ఈ నెల13న కూల్చివేయబడుతాయనీ, ఈ ఆరు బ్లాక్‌లు ఒకదానికొకటి అనుసంధానించబడి ఉన్నాయని చెప్పారు. ట్రయల్ బ్లాస్ట్‌ని ఒక్క బటన్‌ను నొక్కడం ద్వారా నిర్వహించవచ్చు. ట్రయల్ బ్లాస్ట్ కోసం ఇప్పటికే ఈ ప్రాంతం పోలీసుల రక్షణలోకి వెళ్లిందనీ, ఉదయం 8 గంటలకు పని ప్రారంభమవుతుందనీ. కూల్చివేత బృందాలు మధ్యాహ్నం 1 గంటల వరకు భవనం పైభాగంలో బ్లాస్ చేశారని తెలిపారు.
ఈ టవర్లను కూల్చివేసేందుకు కూడా రూ.17.55 కోట్లు ఖర్చవుతుంది. శిధిలాలు తొలగించేందుకు రూ.13.35 కోట్లు ఖర్చవుతుంది. ట్విన్ టవర్లను కూల్చివేసే పనుల కోసం సూపర్ టెక్ కంపెనీ ముంబైకి చెందిన ఎడిఫైస్ అనే ఇంజనీరింగ్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. నోయిడా అథారిటీ నుంచి ఎటువంటి పర్మిషన్ లేకుండానే సూపర్ టెక్ ఎమరాల్ట్ కోర్టు టవర్స్ నిర్మాణం ప్రారంభించారని, అధికారులకు ఈ విషయం తెలిసినా కూడా పట్టించుకోలేదని సుప్రీంకోర్టు గుర్తించింది.
