గతేడాది జనవరిలో  సూపర్ బ్లడ్ మూన్ అందరూ చేసే ఉంటారు. అచ్చం అలాంటిదే ఈ న్యూ ఇయర్ లో జనవరి మాసంలో మనకు కనువిందు చేయనుంది. 

గతేడాది జనవరిలో సూపర్ బ్లడ్ మూన్ అందరూ చేసే ఉంటారు. అచ్చం అలాంటిదే ఈ న్యూ ఇయర్ లో జనవరి మాసంలో మనకు కనువిందు చేయనుంది. అత్యంత అరుదుగా కనిపించే చంద్రగ్రహణం ఈ నెల 20, 21వ తేదీల్లో వీనులవిందు చేయనుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీనికి సూపర్ బ్లడ్ వోల్ఫ్ మూన్ అనే పేరు పెట్టారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

ఇది మూడు ఈశెంట్ల కలయిక. చంద్రగ్రహణం, సూపర్ బ్లడ్ మూన్,వోల్ఫ్ మూన్ కలిస్తే.. ఈ అరుదైన సూపర్ బ్లడ్ వోల్ఫ్ మూన్ ఏర్పడుతుంది. ఈ సంపూర్ణ చంద్రగ్రహణాన్ని మనదేశంలో ప్రజలు పూర్తిగా చూసే అవకాశం లేదు. కొద్దిగా మాత్రమే కనపడే అవకాశం ఉంది. అమెరికా, యూరప్,ఆఫ్రికా ప్రజలకు మాత్రం ఇది పూర్తిగా కనిపిస్తుంది.

నేషనల్ జాగ్రఫిక్ ప్రకారం.. జనవరి 21 ఉదయం 10గంటలకు ఈ గ్రహణం మొదలౌతుంది. 62 నిమిషాల పాటు ఈ ప్రక్రియ కొనసాగుతుంది. పూర్తి ప్రక్రియకు 3గంటల 50 నిమిషాల సమయం పడుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.