Chandrayaan 3: చంద్రయాన్ 3 మిషన్ కీలక దశకు చేరుకుంది. మరికొన్ని గంటల్లో జాబిల్లిపై విక్రమ్ ల్యాండర్ (Vikram Lander) అడుగుపెట్టనున్నది. ఈ ఉత్కంఠ క్షణాల కోసం యావత్ భారతం ఎదురుచూస్తుంది. తాను కూడా ఉత్కంఠభరిత ఘట్టం కోసం ఎంతో ఉత్సాహంగా, ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ (Sunita Williams) పేర్కొన్నారు.
Chandrayaan3: భారత అంతరిక్ష సంస్థ (ఇస్రో) కీలక మైలురాయిని దాటనున్నది. మరికొన్ని గంటల్లో ఇస్రో పంపిన చంద్రయాన్ 3 చంద్రుడి దక్షిణ ధ్రువంపై ల్యాండ్ కానున్నది. ఈ మిషన్ విజయవంతం కావాలని యావత్తు భారతమే కాదు.. యవత్తు ప్రపంచమే ఎంతో ఉత్కంఠంగా ఎదురు చూస్తోంది.
బుధవారం సాయంత్రం 6.04 గంటలకు చంద్రయాన్-3 విక్రమ్ ల్యాండర్ చంద్రుని దక్షిణ ధ్రువంపై సాఫ్ట్ ల్యాండింగ్ అవనున్నది. ఎలాంటి పొరపాట్లకు చాలా పకడ్బందీగా రూపొందించిన విక్రమ్ ల్యాండర్ ప్రణాళికాబద్ధంగా ల్యాండ్ కానున్నదని ఇస్రో శాస్త్రవేత్తలు దీమా వ్యక్తం చేస్తున్నారు. అన్ని అనుకున్నట్టు విక్రమ్ ల్యాండర్ చంద్రుని దక్షిణ ధ్రువంపై ల్యాండయితే.. ఇక్కడ దిగిన మొట్టమొదటి దేశంగా భారత్ హిస్టరీ క్రియేట్ చేస్తుంది.
ఈ ఉత్కంఠభరితమైన తరుణంలో భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ (Sunita Williams) చంద్రయాన్ 3 గురించి కీలక విషయాలను పంచుకుంది. తాను కూడా చంద్రుడి దక్షిణ ధ్రువంపై ప్రజ్ఞాన్ రోవర్ దిగే.. ఉత్కంఠ భరితమైన ఘట్టం కోసం ఎంతో ఉత్సాహంగా, ఆసక్తిగా ఎదురుచూస్తున్నదని పేర్కొన్నారు. అదే సమయంలో అంతరిక్ష పరిశోధన రంగంలో భారత్ సాధించిన పురోగతిని, ఇస్రో పాత్రను కూడా ప్రశంసించారు. పరిశోధనలు, చంద్రునిపై స్థిరమైన జీవితం కోసం అన్వేషణలో భారతదేశం ముందంజలో ఉన్నందుకు తాను నిజంగా థ్రిల్‌గా ఉన్నాననీ,ఇది నిజంగా ఉత్తేజకరమైన సమయమని తెలిపారు.
నేషనల్ జియోగ్రాఫిక్ ఇండియా ఇచ్చిన ఇంటర్య్వూలో సునీతా విలియమ్స్ ఈ ప్రకటన చేశారు. చంద్రుని ఉపరితలాన్ని అన్వేషించడం యొక్క ప్రాముఖ్యతను నొక్కిచెప్పారు. ఈ మిషన్ బహిర్గతం చేసే సమాచారానికి మాత్రమే కాకుండా.. అంతరిక్ష పరిశోధనలు ,చంద్రుడిపై స్థిర నివాసం అన్వేషణల విషయంలో భారత్ ముందంజలో ఉందని సంతోషం వ్యక్తం చేశారు. ఇది నిజంగా ఉత్తేజకరమైన సమయమని, ఈ ప్రాజెక్ట్ వల్ల చంద్రుని కూర్పు, చరిత్రపై గల పరిస్థితులను మరింత మెరుగుగా అవగాహన చేసుకోవడానికి ఉపయోగపడుతోందని పేర్కొన్నారు.
చంద్రుడిపై లాండ్ కానున్న.. ల్యాండర్, రోవర్ ఫలితాల విషయంలో ఎంతో ఉత్సుకతతో ఉన్నాననీ, చంద్రుడిపై అన్వేషణలకు సంబంధించి ఇదొక కీలక మైలురాయి అని సునీతా విలియమ్స్ పేర్కొన్నారు. ఈ ప్రయోగం వల్ల చంద్రుడి దక్షిణ ధ్రువంలో మానవుడి స్థిరమైన నివాసాలను ఏర్పచుకునే అనువైన ప్రదేశాలను గుర్తించడంలో సహాయపడుతుందని చెప్పారు. ఇదిలా ఉండగా.. కల్పనా చావ్లా తర్వాత అంతరిక్షంలో వెళ్లిన భారత సంతతికి చెందిన రెండో మహిళగా సునీతా విలియమ్స్ ఖ్యాతి పొందిన విషయం తెలిసిందే.
ఇదిలా ఉంటే.. ఆగస్టు 23న చంద్రయాన్-3 చంద్రుని ల్యాండింగ్‌ను ప్రత్యక్ష ప్రసారం చేసేలా విద్యార్థులు,ఉపాధ్యాయులను ప్రోత్సహించాలని దేశంలోని విశ్వవిద్యాలయాలు, కళాశాలలను UGC కోరింది. యూజీసీ సెక్రటరీ మనీష్ జోషి ఆగస్టు 21న అన్ని యూనివర్సిటీలు, కాలేజీలను ఈ విషయమై ఆదేశాలు జారీ చేశారు. విద్యార్థులు, ఉపాధ్యాయ అధ్యాపకుల కోసం ప్రత్యేక సమ్మేళనం నిర్వహించి, వారు కూడా ఈ మహిమాన్విత తరుణంలో భాగస్వాములు కావాలని సూచించారు. చంద్రయాన్-3 బుధవారం సాయంత్రం 6.4 గంటలకు చంద్రుడి ఉపరితలంపై ల్యాండ్ అవుతుంది. విద్యార్థులు కూడా ఈ చారిత్రాత్మక ఘట్టానికి సాక్షులుగా నిలిచేలా UGC ఒక అడుగు వేసింది.
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) వెబ్‌సైట్‌తో సహా వివిధ ప్లాట్‌ఫారమ్‌లలో ఆగస్టు 23 సాయంత్రం 5.27 గంటల నుండి ప్రత్యక్ష ప్రసారం అందుబాటులో ఉంటుందని UGC తెలిపింది. ఉన్నత విద్యాసంస్థలు ఆ రోజు సాయంత్రం 5.30 నుండి 6.30 గంటల వరకు ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించాలని, విద్యార్థులు ,ఉపాధ్యాయులు చురుకుగా పాల్గొనడానికి మరియు ప్రత్యక్ష ప్రసారాన్ని చూసేలా ప్రోత్సహించాలని కమిషన్ కోరింది.
