Asianet News TeluguAsianet News Telugu

లాక్ డౌన్ సడలింపులు : ఆదివారాల్లో పెళ్లిళ్లకు ఒకే..!

ఈ నెలలో మిగిలిన రెండు ఆదివారాలు మే 24, మే 31 తేదీల్లో పెళ్లిళ్లు నిర్ణయించుకున్నవారు.. షెడ్యుల్‌ ప్రకారం వాటిని జరుపుకోవచ్చని తెలిపింది. అయితే కేంద్ర ప్రభుత్వం నిర్ధేశించిన మార్గదర్శకాలు పాటించాలని సూచించింది.
 

Sunday Complete Lockdown Not For Marriages Already Scheduled: Karnataka
Author
Hyderabad, First Published May 22, 2020, 2:11 PM IST

దేశంలో కరోనా కేసులు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. వీటిని అరికట్టడానికి లాక్ డౌన్ విధించారు. అయినా కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. అలానీ లాక్ డౌన్ ని అంతే కొనసాగించలేరు కదా.. అందుకని లాక్ డౌన్ 4లో కొద్ది పాటి సడలింపులు చేశారు. ఈక్రమంలో కర్ణాటక రాష్ట ప్రభుత్వం కూడా కొన్ని సడలింపులు చేసింది.

మొన్నటి వరకు కర్ణాటకలో ఆదివారం పూట పూర్తి స్థాయి కర్ఫ్యూను అమలు చేస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలో ఆదివారాల్లో పెళ్లిళ్లు నిర్ణయించుకున్న వారు వాటిని వాయిదా వేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే తాజాగా కర్ణాటక ప్రభుత్వం అటువంటి వారికి గుడ్‌న్యూస్‌ చెప్పింది. 

ఈ నెలలో మిగిలిన రెండు ఆదివారాలు మే 24, మే 31 తేదీల్లో పెళ్లిళ్లు నిర్ణయించుకున్నవారు.. షెడ్యుల్‌ ప్రకారం వాటిని జరుపుకోవచ్చని తెలిపింది. అయితే కేంద్ర ప్రభుత్వం నిర్ధేశించిన మార్గదర్శకాలు పాటించాలని సూచించింది.

ఆదివారం పూర్తి స్థాయి కర్ఫ్యూ అమల్లో ఉన్నప్పటికీ పెళ్లిలను ప్రత్యేకంగా పరిగణించి మినహాయింపు ఇవ్వనున్నట్టు  రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ సభ్యుడు టీకే అనిల్‌ కుమార్‌ తెలిపారు. 

‘రాష్ట్ర వాప్యంగా మే 24, మే 31 తేదీల్లో ముందుగా నిశ్చియించిన పెళ్లిళ్లు జరుపుకోవచ్చు. అయితే మార్గదర్శకాలు పాటించాలి. కేవలం 50 మంది అతిథులు మాత్రమే హాజరు కావాలి. భౌతిక దూరం నిబంధనను పాటించడం, మాస్క్‌లు ధరించడంతోపాటుగా శానిటైజర్‌తో చేతులు కడుక్కోవాలి’ అని ఆదేశాలు జారీచేశారు.

ఇందుకోసం డీసీపీల అనుమతి తీసుకోవాలన్నారు. కంటైన్‌మెంట్‌ జోన్లకు చెందినవారిని పెళ్లికి ఆహ్వానించకూడదని ఆదేశించారు. 65 ఏళ్లు పైబడినవారిని, 10 ఏళ్ల కంటే చిన్నవాళ్లను వివాహా వేడుకలకు దూరంగా ఉంచాలని పేర్కొన్నారు. పెళ్లిలో పాల్గొనేవారు మద్యం సేవించడంపై కూడా నిషేధం విధిస్తున్నట్టు చెప్పారు. 

Follow Us:
Download App:
  • android
  • ios