నేటి వార్తల్లోని ముఖ్యాంశాలివే

Sunday 9th October Telugu News Live

తెలుగు రాష్ట్రాల్లోని తాజా వార్తలతో పాటు జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, క్రీడా, సినీ, క్రైమ్, బిజినెస్ వార్తలను ఎప్పటికప్పుడు ఏషియానెట్ తెలుగు లైవ్ అఫ్ డేట్స్ ద్వారా అందిస్తున్నాం. జస్ట్ వన్ క్లిక్‌తో నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు మీ కోసం...

9:35 PM IST

రాంచీ వన్డేలో టీమిండియా ఘన విజయం

భారత్ - దక్షిణాఫ్రికాల మధ్య రాంచీలో జరిగిన రెండో వన్డేలో టీమిండియా ఘన విజయం సాధించింది. సఫారీలు నిర్దేశించిన 279 పరుగుల లక్ష్యాన్ని భారత్ కేవలం 45.5 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. శ్రేయస్ అయ్యర్ 113, ఇషాన్ కిషన్ 93, సంజూ శాంసన్ 30 పరుగులు చేశారు. ఈ విజయంతో మూడే వన్డేల సీరిస్‌ను భారత్ 1-1 తేడాతో సమం చేసింది. చివరి వన్డే అక్టోబర్ 11న ఢిల్లీలో జరగనుంది. 

9:01 PM IST

ఆప్‌తో టచ్‌లో బీజేపీ నేతలు : కేజ్రీవాల్

గుజరాత్‌ పర్యటనలో ఢిల్లీ సీఎం, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీకి చెందిన ఎంతోమంది నేతలు, కార్యకర్తలు తమ పార్టీకి సీక్రెట్‌గా మద్ధతు ఇస్తున్నారని ఆయన బాంబు పేల్చారు. బీజేపీని ఓడించాలని ఆ పార్టీ నేతలే కోరుకుంటున్నారని కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. 

8:31 PM IST

అమరావతి రైతుల పాదయాత్రలో ఎన్టీఆర్ తనయుడు

ఆంధ్రప్రదేశ్‌ను అమరావతికి ఏకైక రాజధానిగా కొనసాగించాలంటూ రాజధాని ప్రాంత రైతులు నిర్వహిస్తోన్న మహా పాదయాత్రలో దివంగత సీఎం ఎన్టీఆర్ తనయుడు నందమూరి రామకృష్ణ పాల్గొన్నారు. ప్రస్తుతం రైతుల యాత్ర పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ నియోజకవర్గంలో కొనసాగుతోంది. భారీ వర్షాన్ని కూడా లెక్కచేయకుండా రామకృష్ణ రైతులతో కలిసి నడిచారు. 

7:35 PM IST

ఉద్ధవ్ థాక్రే కోరుతున్న గుర్తులివే

శివసేన ఎన్నికల గుర్తు విల్లు బాణంను ఎన్నికల కమీషన్ స్తంభింపజేసిన నేపథ్యంలో ఉద్ధవ్ థాకరే వర్గం మూడు పేర్లు, గుర్తులతో కూడిన జాబితాను ఇచ్చినట్టు ఈసీ వర్గాల సమాచారం. గుర్తు ప‌రంగా.. మొదటి ఎంపిక‌గా త్రిశూలం,  రెండో ఎంపిక‌గా ఉదయించే సూర్యుడు, మూడో ఎంపిక‌గా జ్యోతి  గుర్తును ఇచ్చింది. అలాగే.. పార్టీ పేరు పరంగా మొదటి ఎంపిక‌గా 'శివసేన బాలాసాహెబ్ థాకరే', రెండో ఎంపిక‌గా 'శివసేన ఉద్ధవ్ బాలాసాహెబ్ థాకరే' పేర్లను  ఇవ్వాల‌ని ఉద్ధవ్ థాకరే వర్గం ప్రతిపాదించిన‌ట్టు తెలుస్తోంది.

6:58 PM IST

ములాయం ఆరోగ్యం మరింత విషమం

యూపీ మాజీ సీఎం, సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ ఆరోగ్య పరిస్ధితి విషమంగా మారింది. ఆగస్ట్ 22 నుంచి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు ములాయం. ఆయనకు ప్రాణాధార ఔషధాలు వాడుతున్నామని ఆయన చెప్పారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సహా పలువురు ప్రముఖులు ములాయం ఆరోగ్యం గురించి ఆరా తీస్తున్నారు. 

6:26 PM IST

త్వరలో మునుగోడుకు కేసీఆర్..?

మునుగోడు ఉపఎన్నిక నేపథ్యంలో ఈ నెల 29 లేదా 30న తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రచారం నిర్వహించనున్నారు. చండూరులో ఎన్నికల ప్రచార సభకు టీఆర్ఎస్ పార్టీ ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక్కడ టీఆర్ఎస్ అభ్యర్ధిగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని కేసీఆర్ ఖరారు చేసిన సంగతి తెలిసిందే. 

5:34 PM IST

భారత్ లక్ష్యం 279 పరుగులు

భారత్ - దక్షిణాఫ్రికాల మధ్య రాంచీలో జరుగుతోన్న రెండో వన్డేలో భారత్ ముందు సఫారీలు 279 పరుగుల లక్ష్యాన్ని వుంచారు. ఐదెన్ మార్‌క్రమ్ 79, రీజా హెండ్రిక్స్ 74 పరుగులు చేశారు. భారత బౌలర్లలో సిరాజ్ 3, సుందర్, షహబాద్, కుల్‌దీప్ యాదవ్, శార్దూల్ తలో వికెట్ పడగొట్టారు. 

4:40 PM IST

మతం కోసం సినీ కెరీర్‌కు గుడ్‌బై

ప్రముఖ భోజ్‌పురి నటి సహర్ అఫ్సా సంచలన నిర్ణయం తీసుకున్నారు. సినిమాల నుంచి తప్పుకుంటున్నట్లుగా ప్రకటించారు. ఇస్లాం మతం కోసమే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్ల ఆమె వివరించారు. ఇకపై తాను సినిమాల్లో నటించడం లేదని సహర్ పేర్కొన్నారు గతంలో జైరా వాసిమ్, సనా ఖాన్ కూడా మతపరమైన కారణాలతో సినిమాల నుంచి తప్పుకున్నారు. 

4:03 PM IST

రాజగోపాల్ రెడ్డిపై ఈసీకి టీఆర్ఎస్ ఫిర్యాదు

బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు టీఆర్ఎస్ నేతలు. రూ.18 వేల కాంట్రాక్ట్ తీసుకుని బీజేపీలో చేరారని ఫిర్యాదులో పేర్కొన్నారు. 

3:17 PM IST

హైదరాబాద్‌లో భారీగా హవాలా నగదు స్వాధీనం

హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో భారీగా హవాలా నగదును పట్టుకున్నారు పోలీసులు. రూ.2.5 కోట్ల నగదును టాస్క్‌ఫోర్స్ పోలీసులు సీజ్ చేశారు. ఈ మేరకు ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. రెండ్రోజుల వ్యవధిలో రూ.4 కోట్లు స్వాధీనం చేసుకున్నారు. రాత్రి పాతబస్తీలో రూ.79 లక్షలు పట్టుకున్నారు. మొన్న సాయంత్రం జూబ్లీహిల్స్‌లో రూ.50 లక్షలను సీజ్ చేశారు. 

1:13 PM IST

మధ్యప్రదేశ్ లో బస్ యాక్సిడెంట్... 34 మందికి గాయాలు

మధ్య ప్రదేశ్ లోని దిండోరి జిల్లాలో అర్థరాత్రి ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వెళుతున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుకు బర్రె అడ్డుగా రావడంతో ప్రమాదం జరిగింది. ఒక్కసారిగా బస్సు అదుపుతప్పి బోల్తా పడటంతో 34 మంది ప్రయాణికులు గాయపడ్డారు. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం జరగకున్నా పదిమంది తీవ్ర గాయాలతో హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. 
 
12:23 PM IST

యూపీలో ఘోరం... కరెంట్ షాక్ గురయి ఐదుగురు మృతి

ఉత్తర ప్రదేశ్ లో ఇవాళ తెల్లవారుజామును ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. కరెంట్ షాక్ కు గురయి ముగ్గురు చిన్నారులతో పాటు మరో ఇద్దరు మృతిచెందారు. తెల్లవారుజామున 4గంటల సమయంలో ఓ ఊరేగింపులో ఐరన్ రాడ్ హైటెన్షన్ విద్యుత్ తీగలను తగలడంతో ఐదుగురు మృతిచెందగా మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా వున్నట్లు సమాచారం. 
 
11:34 AM IST

రాజస్థాన్ కాంగ్రెస్ లో విషాదం... సీనియర్ ఎమ్మెల్యే మృతి

కాంగ్రెస్ సీనియర్ నేత, రాజస్థాన్ ఎమ్మెల్యే భన్వర్ లాల్(77) అనారోగ్యంతో మృతిచెందారు. శనివారం సాయంత్రం తీవ్ర అనారోగ్యంతో జైపూర్ లోని ఓ హాస్పిటల్లో చేరిన ఆయన చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం మృతిచెందారు. ఎమ్మెల్యే మృతిపై సీఎం అశోక్ గెహ్లాట్ సంతాపం వ్యక్తం చేసారు. 

10:38 AM IST

డిఎంకే అధ్యక్షుడిగా మరోసారి స్టాలిన్ ఏకగ్రీవం

తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ రెండోసారి డిఎంకే అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఇవాళ డిఎంకే జనరల్ కౌన్సిల్ మీటింగ్ లో మరోసారి స్టాలిన్ కే అధ్యక్ష పదవి అప్పగించాలని ఏకగ్రీవంగా నిర్ణయించారు. 
 
9:42 AM IST

తెలంగాణలో మరో రెండ్రోజులు వర్షాలు

ఇప్పటికే తెలంగాణలో కురుస్తున్న వర్షాలు మరో రెండ్రోజులు (ఆది, సోమవారం) కొనసాగే అవకాశం వుందని వాతావరణ శాఖ ప్రకటించింది. హైదరాబాద్ తో పాటు పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు, ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం వుందని ప్రకటించారు. 

9:42 AM IST

ఏపీ సర్పంచుల సంఘం అధ్యక్షుడిపై పోలీస్ కేసు... మరో 32 మంది సర్పంచులపైనా

ఈనెల 7 తేదీన తాడేపల్లిలోని ఏపీ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగిన సర్పంచులపై పోలీసులు కేసు నమోదు చేసారు. ఆర్థిక సంఘం నిధులు పంచాయతీలకు అందించాలని కోరుతూ సర్పంచులు ఆందోళన చేపట్టారు. ఈ ఆందోళనకు నేతృత్వం వహించిన సర్పంచుల సంఘం అధ్యక్షుడు పాపారావుతో పాటు మరో 32 మంది సర్పంచులపై సీఆర్పీసీ సెక్షన్ 151కింద కేసు నమోదు చేసారు. 

9:35 PM IST:

భారత్ - దక్షిణాఫ్రికాల మధ్య రాంచీలో జరిగిన రెండో వన్డేలో టీమిండియా ఘన విజయం సాధించింది. సఫారీలు నిర్దేశించిన 279 పరుగుల లక్ష్యాన్ని భారత్ కేవలం 45.5 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. శ్రేయస్ అయ్యర్ 113, ఇషాన్ కిషన్ 93, సంజూ శాంసన్ 30 పరుగులు చేశారు. ఈ విజయంతో మూడే వన్డేల సీరిస్‌ను భారత్ 1-1 తేడాతో సమం చేసింది. చివరి వన్డే అక్టోబర్ 11న ఢిల్లీలో జరగనుంది. 

9:01 PM IST:

గుజరాత్‌ పర్యటనలో ఢిల్లీ సీఎం, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీకి చెందిన ఎంతోమంది నేతలు, కార్యకర్తలు తమ పార్టీకి సీక్రెట్‌గా మద్ధతు ఇస్తున్నారని ఆయన బాంబు పేల్చారు. బీజేపీని ఓడించాలని ఆ పార్టీ నేతలే కోరుకుంటున్నారని కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. 

8:31 PM IST:

ఆంధ్రప్రదేశ్‌ను అమరావతికి ఏకైక రాజధానిగా కొనసాగించాలంటూ రాజధాని ప్రాంత రైతులు నిర్వహిస్తోన్న మహా పాదయాత్రలో దివంగత సీఎం ఎన్టీఆర్ తనయుడు నందమూరి రామకృష్ణ పాల్గొన్నారు. ప్రస్తుతం రైతుల యాత్ర పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ నియోజకవర్గంలో కొనసాగుతోంది. భారీ వర్షాన్ని కూడా లెక్కచేయకుండా రామకృష్ణ రైతులతో కలిసి నడిచారు. 

7:35 PM IST:

శివసేన ఎన్నికల గుర్తు విల్లు బాణంను ఎన్నికల కమీషన్ స్తంభింపజేసిన నేపథ్యంలో ఉద్ధవ్ థాకరే వర్గం మూడు పేర్లు, గుర్తులతో కూడిన జాబితాను ఇచ్చినట్టు ఈసీ వర్గాల సమాచారం. గుర్తు ప‌రంగా.. మొదటి ఎంపిక‌గా త్రిశూలం,  రెండో ఎంపిక‌గా ఉదయించే సూర్యుడు, మూడో ఎంపిక‌గా జ్యోతి  గుర్తును ఇచ్చింది. అలాగే.. పార్టీ పేరు పరంగా మొదటి ఎంపిక‌గా 'శివసేన బాలాసాహెబ్ థాకరే', రెండో ఎంపిక‌గా 'శివసేన ఉద్ధవ్ బాలాసాహెబ్ థాకరే' పేర్లను  ఇవ్వాల‌ని ఉద్ధవ్ థాకరే వర్గం ప్రతిపాదించిన‌ట్టు తెలుస్తోంది.

6:58 PM IST:

యూపీ మాజీ సీఎం, సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ ఆరోగ్య పరిస్ధితి విషమంగా మారింది. ఆగస్ట్ 22 నుంచి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు ములాయం. ఆయనకు ప్రాణాధార ఔషధాలు వాడుతున్నామని ఆయన చెప్పారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సహా పలువురు ప్రముఖులు ములాయం ఆరోగ్యం గురించి ఆరా తీస్తున్నారు. 

6:26 PM IST:

మునుగోడు ఉపఎన్నిక నేపథ్యంలో ఈ నెల 29 లేదా 30న తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రచారం నిర్వహించనున్నారు. చండూరులో ఎన్నికల ప్రచార సభకు టీఆర్ఎస్ పార్టీ ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక్కడ టీఆర్ఎస్ అభ్యర్ధిగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని కేసీఆర్ ఖరారు చేసిన సంగతి తెలిసిందే. 

5:34 PM IST:

భారత్ - దక్షిణాఫ్రికాల మధ్య రాంచీలో జరుగుతోన్న రెండో వన్డేలో భారత్ ముందు సఫారీలు 279 పరుగుల లక్ష్యాన్ని వుంచారు. ఐదెన్ మార్‌క్రమ్ 79, రీజా హెండ్రిక్స్ 74 పరుగులు చేశారు. భారత బౌలర్లలో సిరాజ్ 3, సుందర్, షహబాద్, కుల్‌దీప్ యాదవ్, శార్దూల్ తలో వికెట్ పడగొట్టారు. 

4:40 PM IST:

ప్రముఖ భోజ్‌పురి నటి సహర్ అఫ్సా సంచలన నిర్ణయం తీసుకున్నారు. సినిమాల నుంచి తప్పుకుంటున్నట్లుగా ప్రకటించారు. ఇస్లాం మతం కోసమే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్ల ఆమె వివరించారు. ఇకపై తాను సినిమాల్లో నటించడం లేదని సహర్ పేర్కొన్నారు గతంలో జైరా వాసిమ్, సనా ఖాన్ కూడా మతపరమైన కారణాలతో సినిమాల నుంచి తప్పుకున్నారు. 

4:03 PM IST:

బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు టీఆర్ఎస్ నేతలు. రూ.18 వేల కాంట్రాక్ట్ తీసుకుని బీజేపీలో చేరారని ఫిర్యాదులో పేర్కొన్నారు. 

3:17 PM IST:

హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో భారీగా హవాలా నగదును పట్టుకున్నారు పోలీసులు. రూ.2.5 కోట్ల నగదును టాస్క్‌ఫోర్స్ పోలీసులు సీజ్ చేశారు. ఈ మేరకు ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. రెండ్రోజుల వ్యవధిలో రూ.4 కోట్లు స్వాధీనం చేసుకున్నారు. రాత్రి పాతబస్తీలో రూ.79 లక్షలు పట్టుకున్నారు. మొన్న సాయంత్రం జూబ్లీహిల్స్‌లో రూ.50 లక్షలను సీజ్ చేశారు. 

1:13 PM IST:

మధ్య ప్రదేశ్ లోని దిండోరి జిల్లాలో అర్థరాత్రి ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వెళుతున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుకు బర్రె అడ్డుగా రావడంతో ప్రమాదం జరిగింది. ఒక్కసారిగా బస్సు అదుపుతప్పి బోల్తా పడటంతో 34 మంది ప్రయాణికులు గాయపడ్డారు. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం జరగకున్నా పదిమంది తీవ్ర గాయాలతో హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. 
 
12:23 PM IST:

ఉత్తర ప్రదేశ్ లో ఇవాళ తెల్లవారుజామును ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. కరెంట్ షాక్ కు గురయి ముగ్గురు చిన్నారులతో పాటు మరో ఇద్దరు మృతిచెందారు. తెల్లవారుజామున 4గంటల సమయంలో ఓ ఊరేగింపులో ఐరన్ రాడ్ హైటెన్షన్ విద్యుత్ తీగలను తగలడంతో ఐదుగురు మృతిచెందగా మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా వున్నట్లు సమాచారం. 
 
11:34 AM IST:

కాంగ్రెస్ సీనియర్ నేత, రాజస్థాన్ ఎమ్మెల్యే భన్వర్ లాల్(77) అనారోగ్యంతో మృతిచెందారు. శనివారం సాయంత్రం తీవ్ర అనారోగ్యంతో జైపూర్ లోని ఓ హాస్పిటల్లో చేరిన ఆయన చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం మృతిచెందారు. ఎమ్మెల్యే మృతిపై సీఎం అశోక్ గెహ్లాట్ సంతాపం వ్యక్తం చేసారు. 

10:38 AM IST:

తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ రెండోసారి డిఎంకే అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఇవాళ డిఎంకే జనరల్ కౌన్సిల్ మీటింగ్ లో మరోసారి స్టాలిన్ కే అధ్యక్ష పదవి అప్పగించాలని ఏకగ్రీవంగా నిర్ణయించారు. 
 
9:42 AM IST: