నేటి వార్తల్లోని ముఖ్యాంశాలివే

Sunday 18th September telugu news live

తెలుగు రాష్ట్రాల్లోని తాజా వార్తలతో పాటు జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, క్రీడా, సినీ, క్రైమ్, బిజినెస్ వార్తలను ఎప్పటికప్పుడు ఏషియానెట్ తెలుగు లైవ్ అఫ్ డేట్స్ ద్వారా అందిస్తున్నాం. జస్ట్ వన్ క్లిక్‌తో నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు మీ కోసం...
 
9:03 PM IST

వెనక్కి మళ్లిన చైనా సైన్యం

భారత్‌తో సరిహద్దుల వెంట ఉద్రిక్త పరిస్ధితుల నేపథ్యంలో చైనా కీలక నిర్ణయం తీసుకుంది. గోగ్రా- హాట్ స్ప్రింగ్స్ ప్రాంతం నుంచి తన బలగాలను 3 కిలోమీటర్లు వెనక్కి పిలిపించింది. ఇటీవల భారత్, చైనా సైనికాధికారుల మధ్య జరిగిన చర్చల అనంతరం చైనా ఈ నిర్ణయం తీసుకోవడం విశేషం. 

8:08 PM IST

ప్రైవేట్ సంస్థలకు విరాళాలొద్దు: టీటీడీ

అన్నదానం పేరు చెప్పే ప్రైవేట్ సంస్థలకు విరాళాలు ఇవ్వొద్దని భక్తులకు స్పష్టం చేసింది తిరుమల తిరుపతి దేవస్థానం. మరోవైపు.. టీటీడీ విద్యుత్ బస్సులను ప్రవేశపెడుతోంది. ఈ నెల 27న సీఎం జగన్ వీటిని ప్రారంభించనున్నారు. కడప, నెల్లూరు, మదనపల్లె పట్టణాలకు 12 చొప్పున ఈ బస్సులను కేటాయించనున్నారు. 

6:48 PM IST

తిరుమలలో భక్తుల రద్దీ

తిరుమలలో భక్తల రద్దీ కొనసాగుతోంది. వైకుంఠ క్యూకాంప్లెక్స్‌లోని కంపార్ట్‌మెంట్లు భక్తులతో పూర్తిగా నిండిపోయాయి. ఆస్థాన మండపం వరకు క్యూలైన్‌లో వేచి వున్నారు భక్తులు. శ్రీవారి సర్వదర్శనానికి 15 గంటల సమయం పడుతోంది. 
 
5:57 PM IST

తైవాన్‌లో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు

తైవాన్‌ను ఆదివారం భారీ భూకంపం కుదిపేసింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 6.9గా నమోదైనట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. తైటుంగ్ పట్టణానికి ఉత్తరంగా 50 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు తెలిపింది. భూకంపం కారణంగా జపాన్‌లోని దీవులకు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. 

5:16 PM IST

మునుగోడు ప్రజలు అమ్ముడుపోరు: భట్టి

కాంగ్రెస్ పార్టీకి మునుగోడు బలమైన నియోజకవర్గమన్నారు తెలంగాణ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. ఇక్కడి ప్రజలు వారి సిద్ధాంతాలు, భావజాలానికి కట్టుబడి వుంటారే తప్పించి డబ్బులకు అమ్ముడుపోరని భట్టి చెప్పారు. డబ్బు, అహంకారాన్ని ప్రదర్శిస్తున్న వారి మెడలు వంచడానికి మునుగోడు ప్రజలు సిద్ధంగా వున్నారని విక్రమార్క తెలిపారు. 

4:03 PM IST

తమిళ నటి దీప ఆత్మహత్య

తమిళ చిత్ర పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. యువ నటి దీప ఆత్మహత్యకు పాల్పడింది. చెన్నై విరుగంబాక్కంలోని తన ఫ్లాట్‌లో ఉరి వేసుకుని దీప బలవన్మరణానికి పాల్పడ్డారు. నా చావుకు ఎవరూ కారణం కాదని ఆమె సూసైడ్ నోట్‌లో రాశారు. 

3:06 PM IST

హైదరాబాద్ జింఖానా గ్రౌండ్ వద్ద ఉద్రిక్తత

హైదరాబాద్ జింఖానా గ్రౌండ్ దగ్గర క్రికెట్ అభిమానుల ఆందోళన నిర్వహించారు. ఈ నెల 25న ఉప్పల్ స్టేడియంలో భారత్ vs ఆస్ట్రేలియా క్రికెట్ మ్యాచ్‌కు సంబంధించి టికెట్ల కోసం అభిమానులు పోటెత్తారు. అయితే ఎంతకు బుకింగ్ ఓపెన్ చేయకపోవడంతో ఫ్యాన్స్ ఆందోళనకు దిగారు. 

2:23 PM IST

సింగరేణిలో ఉద్యోగాల భర్తీకి హైకోర్ట్ బ్రేక్

సింగరేణిలో జూనియర్ అసిస్టెంట్ గ్రేడ్ 2 ఉద్యోగాల భర్తీ ప్రక్రియ నిలిపివేయాలని హైకోర్టు ఆదేశించింది. తదుపరి నిర్ణయం వెలువడే వరకు ఉద్యోగాల భర్తీని నిలిపివేయాలని సింగరేణి రిక్రూట్‌మెంట్ సెల్‌ను ఆదేశించింది. 
 
1:12 PM IST

జనసేన చీఫ్ పవన్ బస్ యాత్ర వాయిదా...

జనసేన శ్రేణుల్లో జోష్ పెంచి పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు పవన్ కల్యాణ్ చేపట్టనున్నట్లు ప్రకటించిన బస్సు యాత్ర వాయిదా పడింది. అక్టోబర్ నుండి చేపడతానని ప్రకటించిన బస్సు యాత్రను వాయిదా వేస్తున్నట్లు స్వయంగా పవన్ కల్యాణే ప్రకటించారు. 
 
11:40 AM IST

నా తండ్రిది హత్యే... నన్నూ చంపాలని చూస్తున్నారు: వైఎస్ షర్మిల సంచలనం

వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల సంచలన వ్యాఖ్యలు చేసారు. తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డిని కుట్ర చేసి చంపారని పేర్కొన్నారు. అలాగే ఇప్పుడు తనను కూడా చంపాలని చూస్తున్నారంటూ ఆందోళన వ్యక్తం చేసారు. ఈ క్రమంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.  
 
10:44 AM IST

భారత్ లో 47,922కు చేరిన కరోనా యాక్టివ్ కేసులు

భారత్ లో కరోనా మహమ్మారి విజృంభణ తగ్గుముఖం పట్టింది. గతకొంతకాలంగా దేశంలో పదివేల కంటే తక్కువగా రోజువారి కేసులు నమోదవుతున్నాయి. తాజాగా గత 24 గంటల్లో5,664 కొత్తకేసులు బయటపడగా 29 మరణించారు. దీంతో దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 47,922 కు చేరాయి. ఇక ఇప్పటివరకు నమోదయిన కరోనా కేసుల సంఖ్య 4,39,57,929కి చేరితే మరణాల సంఖ్య 5,28,327కి చేరింది.  
  
9:53 AM IST

బంజారాహిల్స్ లో కారు బీభత్సం...

తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో ఇవాళ తెల్లవారుజామున ఓ కారు బీభత్సం సృష్టించింది.  బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లో వేగంగా వెళుతూ అదుతప్పిన కారు రోడ్డుపక్కకు దూసుకెళ్లి దేవాలయాన్ని ఢీకొట్టింది. తెల్లవారుజామున ఈ ప్రమాదం జరగడంతో పెను ప్రమాదం తప్పింది. యువకుడి తీవ్ర గాయాలతో అపోలో హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడు. 

9:40 AM IST

తెలంగాణ, ఏపీలో ఎన్ఐఏ సోదాలు... ఉగ్రవాద కార్యాకలాపాల అనుమానం

ఉగ్రవాద కార్యకలాపాల అనుమానంతో తెలుగు రాష్ట్రాల్లో ఎన్ఐఏ సోదాలు చేపట్టింది. నిజామాబాద్, కర్నూల్, గుంటూరు జిల్లాలో ఎన్ఐఏ దాడులు కొనసాగుతున్నాయి. కరాటే శిక్షణ, లీగల్ అవేర్ నెస్ ముసుగులో యువతను ఉగ్రవాదంలోకి లాగుతున్నట్లు అనుమానిస్తూ పిఎఫ్ఐ కార్యాలయాలపై దాడులు చేపట్టారు. 

read more ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఎన్ఐఏ సోదాలు: ఏక కాలంలో తనిఖీలు
 
9:03 PM IST:

భారత్‌తో సరిహద్దుల వెంట ఉద్రిక్త పరిస్ధితుల నేపథ్యంలో చైనా కీలక నిర్ణయం తీసుకుంది. గోగ్రా- హాట్ స్ప్రింగ్స్ ప్రాంతం నుంచి తన బలగాలను 3 కిలోమీటర్లు వెనక్కి పిలిపించింది. ఇటీవల భారత్, చైనా సైనికాధికారుల మధ్య జరిగిన చర్చల అనంతరం చైనా ఈ నిర్ణయం తీసుకోవడం విశేషం. 

8:08 PM IST:

అన్నదానం పేరు చెప్పే ప్రైవేట్ సంస్థలకు విరాళాలు ఇవ్వొద్దని భక్తులకు స్పష్టం చేసింది తిరుమల తిరుపతి దేవస్థానం. మరోవైపు.. టీటీడీ విద్యుత్ బస్సులను ప్రవేశపెడుతోంది. ఈ నెల 27న సీఎం జగన్ వీటిని ప్రారంభించనున్నారు. కడప, నెల్లూరు, మదనపల్లె పట్టణాలకు 12 చొప్పున ఈ బస్సులను కేటాయించనున్నారు. 

6:48 PM IST:

తిరుమలలో భక్తల రద్దీ కొనసాగుతోంది. వైకుంఠ క్యూకాంప్లెక్స్‌లోని కంపార్ట్‌మెంట్లు భక్తులతో పూర్తిగా నిండిపోయాయి. ఆస్థాన మండపం వరకు క్యూలైన్‌లో వేచి వున్నారు భక్తులు. శ్రీవారి సర్వదర్శనానికి 15 గంటల సమయం పడుతోంది. 
 
5:57 PM IST:

తైవాన్‌ను ఆదివారం భారీ భూకంపం కుదిపేసింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 6.9గా నమోదైనట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. తైటుంగ్ పట్టణానికి ఉత్తరంగా 50 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు తెలిపింది. భూకంపం కారణంగా జపాన్‌లోని దీవులకు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. 

5:16 PM IST:

కాంగ్రెస్ పార్టీకి మునుగోడు బలమైన నియోజకవర్గమన్నారు తెలంగాణ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. ఇక్కడి ప్రజలు వారి సిద్ధాంతాలు, భావజాలానికి కట్టుబడి వుంటారే తప్పించి డబ్బులకు అమ్ముడుపోరని భట్టి చెప్పారు. డబ్బు, అహంకారాన్ని ప్రదర్శిస్తున్న వారి మెడలు వంచడానికి మునుగోడు ప్రజలు సిద్ధంగా వున్నారని విక్రమార్క తెలిపారు. 

4:03 PM IST:

తమిళ చిత్ర పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. యువ నటి దీప ఆత్మహత్యకు పాల్పడింది. చెన్నై విరుగంబాక్కంలోని తన ఫ్లాట్‌లో ఉరి వేసుకుని దీప బలవన్మరణానికి పాల్పడ్డారు. నా చావుకు ఎవరూ కారణం కాదని ఆమె సూసైడ్ నోట్‌లో రాశారు. 

3:06 PM IST:

హైదరాబాద్ జింఖానా గ్రౌండ్ దగ్గర క్రికెట్ అభిమానుల ఆందోళన నిర్వహించారు. ఈ నెల 25న ఉప్పల్ స్టేడియంలో భారత్ vs ఆస్ట్రేలియా క్రికెట్ మ్యాచ్‌కు సంబంధించి టికెట్ల కోసం అభిమానులు పోటెత్తారు. అయితే ఎంతకు బుకింగ్ ఓపెన్ చేయకపోవడంతో ఫ్యాన్స్ ఆందోళనకు దిగారు. 

2:23 PM IST:

సింగరేణిలో జూనియర్ అసిస్టెంట్ గ్రేడ్ 2 ఉద్యోగాల భర్తీ ప్రక్రియ నిలిపివేయాలని హైకోర్టు ఆదేశించింది. తదుపరి నిర్ణయం వెలువడే వరకు ఉద్యోగాల భర్తీని నిలిపివేయాలని సింగరేణి రిక్రూట్‌మెంట్ సెల్‌ను ఆదేశించింది. 
 
1:12 PM IST:

జనసేన శ్రేణుల్లో జోష్ పెంచి పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు పవన్ కల్యాణ్ చేపట్టనున్నట్లు ప్రకటించిన బస్సు యాత్ర వాయిదా పడింది. అక్టోబర్ నుండి చేపడతానని ప్రకటించిన బస్సు యాత్రను వాయిదా వేస్తున్నట్లు స్వయంగా పవన్ కల్యాణే ప్రకటించారు. 
 
11:40 AM IST:

వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల సంచలన వ్యాఖ్యలు చేసారు. తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డిని కుట్ర చేసి చంపారని పేర్కొన్నారు. అలాగే ఇప్పుడు తనను కూడా చంపాలని చూస్తున్నారంటూ ఆందోళన వ్యక్తం చేసారు. ఈ క్రమంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.  
 
10:44 AM IST:

భారత్ లో కరోనా మహమ్మారి విజృంభణ తగ్గుముఖం పట్టింది. గతకొంతకాలంగా దేశంలో పదివేల కంటే తక్కువగా రోజువారి కేసులు నమోదవుతున్నాయి. తాజాగా గత 24 గంటల్లో5,664 కొత్తకేసులు బయటపడగా 29 మరణించారు. దీంతో దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 47,922 కు చేరాయి. ఇక ఇప్పటివరకు నమోదయిన కరోనా కేసుల సంఖ్య 4,39,57,929కి చేరితే మరణాల సంఖ్య 5,28,327కి చేరింది.  
  
9:53 AM IST:

తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో ఇవాళ తెల్లవారుజామున ఓ కారు బీభత్సం సృష్టించింది.  బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లో వేగంగా వెళుతూ అదుతప్పిన కారు రోడ్డుపక్కకు దూసుకెళ్లి దేవాలయాన్ని ఢీకొట్టింది. తెల్లవారుజామున ఈ ప్రమాదం జరగడంతో పెను ప్రమాదం తప్పింది. యువకుడి తీవ్ర గాయాలతో అపోలో హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడు. 

9:41 AM IST: