Asianet News TeluguAsianet News Telugu

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఎన్ఐఏ సోదాలు: ఏక కాలంలో తనిఖీలు

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్ఐఏ అధికారులు సోదాలు చేస్తున్నారు. తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో ఉగ్రవాద కార్యకలాపాలకు సహకరిస్తున్నారనే అనుమానంతో ఎన్ఐఏ సోదాలు చేపట్టింది. రెండు రాష్ట్రాల్లో ఏక కాంలో సోదాలు నిర్వహిస్తున్నారు. 

NIA conducts multiple searches in Andhra  Pradesh and Telangana
Author
First Published Sep 18, 2022, 9:29 AM IST


హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఎన్ఐఏ అధికారులు ఆదివారం నాడు సోదాలు చేస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల ఎన్ఐఏ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఉగ్రవాద కార్యకలాపాలకు సంబంధించి అనుమానాలతో ఎన్ఐఏ అధికారులు సోదాలు జరుపుతున్నారు. విదేశాల నుండి నగదు బదిలీ, బ్యాంకు ఖాతాల లావాదేవీలు జరిగినట్టుగా ఎన్ఐఏ అధికారులు గుర్తించారు.ఈ విషయమై ఆరా తీస్తున్నారు. 

తెలంగాణలోని నిజామాబాద్, నిర్మల్, ఆంధ్రప్రదేశ్  రాష్ట్రంలోని గుంటూరు, నంద్యాల జిల్లాల్లో ఎన్ఐఏ అధికారులు తనిఖీలు చేస్తున్నారు.  తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లా బోధన్ లో ఎన్ఐఏ అధికారులు  నాాలుగు బృందాలుగా ఏర్పడి సోదాలు చేస్తున్నారు.  భైంసా అల్లర్లతో సంబంధాలున్నాయనే అనుమానంతో కూడా ఎన్ఐఏ సోదాలు చేస్తుంది.  ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పీఎఫ్ఐ జిల్లా కన్వీనర్  షాదుల్లా , ఇమ్రాన్, మోబిన్ లను పోలీసులు అరెస్ట్ చేశారు కరాటే శిక్షణ , లీగల్ ఆవేర్ నెస్ పేరుతో యువతను ఉగ్రవాద కార్యకలాపాలపై వైపునకు మళ్లిస్తున్నారని పోలీసులు గుర్తించారు. 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నంద్యాలలో పీఎఫ్ఐ జిల్లా కన్వీనర్ యూసుఫ్ ఇంట్లో కూడ ఎన్ఐఏ అధికారులు సోదాలు చేస్తున్నారు. 
మత కల్లోహలు సృష్టించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఎన్ఐఏ అధికారులు అనుమానిస్తున్నారు. నంద్యాలలో ఎన్ఐఏ సోదాలను నిరసిస్తూ పీఎఫ్ఐ కార్యకర్తలు ఆందోళన చేశారు. గతంలో కూడా నంద్యాలలో ఎన్ఐఏ అధికారులు సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే.

 నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలో కూడా ఎన్ఐఏ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. బుచ్చిరెడ్డిపాలెంట్ ఇలియాస్ సహ అతని మిత్రుల ఇళ్లలో కూడా ఎన్ఐఏ సోదాలు చేస్తుంది. పలు రికార్డులను కూడా ఎన్ఐఏ అధికారులు సీజ్ చేశారు.సోదాలు చేస్తున్న సమయంలో ఇతరులను ఎవరిని కూడ ఎన్ఐఏ అధికారులు అనుమతించడం లేదు. మరోవైపు ఉమ్మడి కడప జిల్లాలో కూడ ఎన్ఐఏ అధికారులు సోదాలు చేస్తున్నారు.

పలువురికి ఎన్ఐఏ నోటీసులు

హైద్రాబాద్ లో  ఉగ్రవాద కార్యకలాపాలకు సంబంధించి ఎన్ఐఏ కేసు నమోదు చేసింది.  120 (బి), 121(ఎ), 153(ఎ), 141 ఆర్ / డబ్ల్యు,  34 ఐపీసీ సెక్షన్ల కింద కేసులు నమోదు  చేశారు. పలువురికి  41 సీఆర్‌పీసీ సెక్షన్ కింద నోటీసులు జారీ చేశారు.  రేపు విచారణకు హజరు కావాలని  నోటీసుల్లో పేర్కొన్న  ఎన్ఐఏ అధికారులు,  హైద్రాబాద్ లోని తమ కార్యాలయంలో రేపు విచారణకు రావాలని ఆ నోటీసుల్లో ఎన్ఐఏ అధికారులు తెలిపారు.

ఎన్ఐఏ సోదాల్లో జీఎస్టీ అధికారులు

ఎన్ఐఏ అధికారులు చేస్తున్న సోదాల్లో జీఎస్టీ అధికారులు కూడ పాల్గొన్నారు. విదేశాల నుండి వచ్చిన నిధుల విషయమై జీఎస్టీ అధికారులు ఆరా తీస్తున్నారు. విదేశాలకు చెందిన వ్యక్తులతో జరిపిన సంభాషణలపై కూడ ఆరా తీస్తున్నారు. 20 మంది జీఎస్టీ అధికారులు ఎన్ఐఏ సోదాల్లో పాల్గొన్నారు. బ్యాంక్ ఖాతాలు, విదేశాల నుండి వచ్చిన  నగదు విషయమై జీఎస్టీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios