శిరోమణి అకాలీదళ్ అధినేత, పంజాబ్ ప్రతిపక్షనేత సుఖ్‌బీర్‌సింగ్ బాదల్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి బల్బీర్ సింగ్ సిద్ధూని బర్తరఫ్ చేయాలని కోరుతూ మంగళవారం శిరోమణి అకాలీదళ్ నేతృత్వంలో నిరసన కార్యక్రమం జరిగింది

శిరోమణి అకాలీదళ్ అధినేత, పంజాబ్ ప్రతిపక్షనేత సుఖ్‌బీర్‌సింగ్ బాదల్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి బల్బీర్ సింగ్ సిద్ధూని బర్తరఫ్ చేయాలని కోరుతూ మంగళవారం శిరోమణి అకాలీదళ్ నేతృత్వంలో నిరసన కార్యక్రమం జరిగింది. పార్టీ కార్యకర్తలు, శ్రేణులతో కలిసి బాదల్ చండగఢ్‌లో ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో మిత్రపక్షంగా వ్యవహరించనున్న బీఎస్‌పీ కూడా ఈ నిరసనకు మద్ధతు తెలిపింది. ఈ మేరకు పంజాబ్ బీఎస్పీ అధ్యక్షుడు జస్వీర్ సింగ్ గార్హి ఆందోళన కార్యక్రమంలో పాల్గొన్నారు.

Also Read:కోవిడ్ కిట్ల కుంభకోణం: అమరీందర్ సింగ్ ఇంటిని ముట్టడించిన అకాలీదళ్, ఉద్రిక్తత

వందలాది మంది నిరసనకారులు, పార్టీ జెండాలు మోస్తూ పోలీసుల బారీకేడ్లను తొలగించుకుంటూ దూసుకొచ్చారు. వీరిని అడ్డుకోవడానికి పోలీసులు వాటర్ కేనన్లను ప్రయోగించారు. కోవిడ్ రోగులకు వ్యాక్సిన్ల అమ్మకం, మెడికల్ కిట్ల సేకరణలో జరిగిన అవకతవకలపై సీబీఐ దర్యాప్తు చేయాలంటూ సుఖ్‌బీర్ సింగ్ బాదల్ డిమాండ్ చేస్తున్నారు. 2022 అసెంబ్లీ ఎన్నికలకు ముందు కొద్దినెలల ముందు ప్రజలను ఆకట్టుకోవడానికి గాను వివిధ సమస్యలపై అమరీందర్ సింగ్ ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు లక్ష్యంగా చేసుకుంటున్నాయి.