Asianet News TeluguAsianet News Telugu

బాడీ పార్టులతో సూట్‌కేస్ లభ్యం.. శ్రద్ధా వాకర్ కేసుతో లింక్ పెట్టిన పోలీసులు!

హర్యానాలో ఫరీదాబాద్ అడవుల్లో బాడీపార్టులతో ఓ సూట్ కేసు లభించింది. దీని గురించి ఫరీదాబాద్ పోలీసులు ఢిల్లీ పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆ సూట్ కేసును శ్రద్ధా వాకర్ కేసుతో లింక్ పెట్టే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తున్నది.
 

suitcase found with body parts may be link to shraddha walkar
Author
First Published Nov 25, 2022, 7:30 PM IST

న్యూఢిల్లీ: హర్యానాకు చెందిన ఫరీదాబాద్ అడవుల్లో మనిషి బాడీ పార్టులతో ఓ సూట్ కేసు గురువారం మధ్యాహ్నం లభించింది. అవి 27 ఏళ్ల శ్రద్ధా వాకర్ డెడ్ బాడీకి చెందిన భాగాలు అయివుంటాయని పోలీసులు భావిస్తున్నారు. సూరజ్‌కుండ్ ఫారెస్ట్ ఏరియాలో ఓ సూట్ కేసులో బాడీ పార్టులు లభించగానే ఫరీదాబాద్ పోలీసులు ఢిల్లీ పోలీసులను కాంటాక్ట్ చేశారు. ఆ బాడీ పార్టులు ఓ ప్లాస్టిక్ బ్యాగు, మరో సంచిలో చుట్టి ఉన్నాయని, దానితోపాటు బట్టలు, బెట్లు కూడా సూట్ కేస్ దగ్గర రికవరీ చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు.

ఆ హత్య ఎక్కడో జరిగి బాడీ పార్టులను ఇక్కడ పడేసినట్టుగా ఉన్నాయని ఫరీదాబాద్ పోలీసులు ఓ ప్రకటనలో తెలిపారు. ఫరీదాబాద్ పోలీసులు సమాచారం చేరవేయగానే ఢిల్లీ పోలీసులు స్పాట్‌కు చేరుకుని దర్యాప్తులో భాగం పంచుకుంటున్నారు.

సూట్ కేసు నుంచి లభించిన బాడీ పార్టులు శ్రద్ధా వాకర్ డెడ్ బాడీకి సంబంధించినవి అయి ఉండొచ్చని ఢిల్లీ పోలీసులు తెలిపారు. 

కొన్నేళ్ల క్రితం ఆ హత్య జరిగి ఉండొచ్చని, ఆ బాడీ పురుషుడిదా? మహిళదా? అనే విషయాన్ని గుర్తించలేకుండా ఉన్నదని కొన్ని వర్గాలు వివరించాయి.

Also Read: ఆఫ్తాబ్ పాలిగ్రాఫ్ పరీక్షల్లో విస్తుపోయే వాస్తవాలు.. నేడూ కొనసాగనున్న టెస్టులు..

ఈ డెడ్ బాడీకి సంబంధించి శాంపిళ్లను దాచి పెడతామని, ఒక వేళ ఢిల్లీ పోలీసులు డీఎన్ఏ టెస్టు చేయాలనుకుంటే అందుకు వినియోగించవచ్చని ఫరీదాబాద్ పోలీసులు తెలిపినట్టు కొన్ని వర్గాలు మీడియాకు వివరించాయి.

Follow Us:
Download App:
  • android
  • ios