సూఫియా సూఫీ మరోసారి అంటే ఐదో సారి గిన్నిస్ బుక్‌లో తన పేరిట రికార్డు రాసుకోవాలని ఉవ్విళ్లూరుతున్నారు. మనాలీ నుంచి లేహ్ వరకు పర్వత ప్రాంతాల గుండా ఆమె 100 గంటల్లో పరుగెత్తాలని సవాల్ వేసుకున్నారు.
Sufiya Sufi: భారత దేశ ప్రముఖ, అల్ట్రా రన్నర్ సూఫియా సూఫీ మరో సారి రోడ్డుపై పరుగులు తీస్తున్నారు. ఈ సారి ఆమె ఐదోసారి గిన్నిస్ రికార్డు తన పేరిట రాసుకోవాలని పట్టుదలతో ఉన్నారు. మనాలీ నుంచి లేహ్‌కు కేవలం 100 గంటల్లో పరుగు పూర్తి చేయాలనేది ఆమె టార్గెట్. ఈ రూట్‌లో ఇది ఆమె రెండో ఫీట్. గతంలో ఇదే రూట్‌లో ఆమె 156 గంటల్లో తన పరుగు పూర్తి చేసుకున్నారు.
‘2021లో నేను 156 గంటల్లో పూర్తి చేశాను. ఇప్పుడు దాన్ని 100 గంటలకే కుదించుకుని స్వయంగా సవాల్ విసురుకున్నాను’ అని సూఫియా అన్నారు. ఆమె ఇప్పుడు మనాలీ పట్టణం నుంచి పది కిలోమీటర్ల దూరంలోని మజాచ్ గ్రామంలో ఉంటున్నారు. జూన్‌లో ప్రిపరేషన్ పీక్‌లో ఉండాలని ప్లాన్ వేసుకున్నారు. జులై ఫస్ట్ వీక్‌లో మనాలీ నుంచి లేహ్‌కు రన్ చేయనున్నారు. ఇందుకోసం తాను మానసికంగా సిద్ధం కావాల్సి ఉన్నదని, అందుకే తనకు తాను సమయం ఇచ్చుకుంటున్నానని వివరించారు.
చివరి సారి తాను తనకు సరిపడా సమయం కేటాయించలేదని, అక్కడి పర్యావరణానికి అలవాటు పడటానికి సమయాన్ని ఇచ్చుకోలేదని అభిప్రాయపడ్డారు. అందుకే ఆ ఫీట్ కంప్లీట్ చేయడానికి 150 గంటలు పట్టిందని, ఆ తప్పిదం నుంచి ఇప్పుడు తాను పాఠాలు నేర్చుకున్నానని వివరించారు.
Also Read: యూట్యూబ్‌లో నకిలీ ముల్లాల బోధనలు ప్రమాదకరం.. ఊహా ప్రపంచంతో వాస్తవ సమస్యలు పరిష్కృతమవుతాయా?
మారుమూల గ్రామంలో ఉన్నందున తన సవాల్ పై ఏకాగ్రతగా ఉంటున్నానని సూఫియా అన్నారు. 70 కుటుంబాలు నివసించే కుగ్రామం మజాచ్. ఇక్కడి ప్రజలు చాలా మంచి వారని, ఒకరికొకరు సహాయం చేసుకుంటారని తెలిపారు. ఫ్రెష్ ఫుడ్ తింటున్నారని, ఈ రన్ అయిపోయాక కూడా ఏడాది పాటు ఉంటానేమో ఇక్కడే అంటున్నారు చిరునవ్వుతో.
మంచు ఇంకా కురుస్తున్న సమయంలోనే వేకువ జామునే ఆమె ప్రాక్టీస్ మొదలవుతుంది. ప్రతి రోజు 10 కిలోమీటర్లు పరుగెడుతుంది. పీక్స్ స్టేజ్ ప్రాక్టీస్‌లో దీన్ని 30 కిలోమీటర్ల నుంచి 40 కిలోమీటర్లకు పెంచనుంది. తాను పర్వతాలు ఎక్కుతున్నప్పుడు 5 నుంచి 6 కిలోమీటర్ల పరుగు.. మైదానాల్లో 20 కిలోమీటర్ల పరుగుతో సమానం అని తెలిపారు.

తన డైట్‌లో ఎక్కువ భాగం ఊపిరి తిత్తుల ఆరోగ్యానికి సంబంధించి నవేనని సూఫియా చెప్పారు. ఇక్కడ ఆక్సిజన్ లెవెల్స్ చాలా తక్కువ ఉంటాయని, కాబట్టి, తన ఊపిరితిత్తులను బలోపేతం చేసుకోవాల్సి ఉంటుందని అన్నారు. మానసికంగా దృఢంగా ఉండటానికి మెడిటేషన్ చేస్తు న్నట్టు వివరించారు.
అయితే, తనకు సహాయంగా ఫిజియోథెరపిస్ట్, ఒక డాక్టర్ స్పాన్సర్ చేస్తే బాగుంటుందని, తన టాస్క్ ఇంకా సులభతరం అవుతుందని అభిప్రాయపడ్డారు.
ఖతర్ సర్క్యూట్‌ను 200 గంట్లో పరుగెత్తిన కొన్ని నెలల్లోనే తాజాగా, మనాలీ లేహ్ టాస్క్ తీసుకున్నారు. మరికొన్ని నెలల తర్వాత ఆమె యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కు చెందిన ఏడు ఎమిరేట్‌లను ఏడు రోజుల్లో పరుగెత్తాలని సవాల్ వేసుకుంది.
--- రిపోర్టింగ్, నకుల్ శివాని
