West Bengal:  భారతీయ జనతా పార్టీ (బీజేపీ) మాజీ ఎంపీ సుబ్రమణ్యస్వామి పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో గురువారం రాష్ట్ర సచివాలయంలో దాదాపు అరగంటపాటు సమావేశమయ్యారు. ఈ మేరకు అధికార వర్గాలు తెలిపాయి.

West Bengal: కోల్‌కతా పర్యటనలో భాగంగా భారతీయ జనతా పార్టీ (బిజెపి) సీనియర్ నాయకుడు సుబ్రమణ్యస్వామి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని కలిశారు. బిజెపి మాజీ ఎంపి సుబ్రమణ్యస్వామి గురువారం కోల్‌కతా రాష్ట్ర సచివాలయంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు మమతా బెనర్జీతో భేటీ అయ్యారు. వీరి భేటీ దాదాపు అరగంట పాటు జరిగింది. ఈ స‌మావేశంలో ప‌లు కీల‌క విష‌యాల‌ను చ‌ర్చించిన‌ట్టు స‌మాచారం. ఈ భేటీ అనంత‌రం సుబ్ర‌మ‌ణ్య స్వామి స్వయంగా ట్వీట్ చేస్తూ మమతా బెనర్జీని ప్రశంసించారు.

సుబ్రమణ్యస్వామి ట్వీట్ చేస్తూ, “ఈ రోజు నేను కోల్‌కతాలో ఉన్నాను మరియు ఆకర్షణీయమైన నాయకురాలు మమతా బెనర్జీని కలిశాను. ధైర్యసాహసాలు కలిగిన వ్యక్తిత్వం ఆమెది. కమ్యూనిస్టులను తుడిచిపెట్టిన మార్క్సిస్ట్ కమ్యూనిస్ట్ పార్టీ (సీపీఐ-ఎం)కి వ్యతిరేకంగా ఆమె చేసిన పోరాటాన్ని మెచ్చుకున్నాను. అని పేర్కొన్నారు.

Scroll to load tweet…

ఈ సమావేశాన్ని మర్యాదపూర్వక సమావేశంగా భావిస్తున్నారు. అయితే మమతా బెనర్జీని కలిసిన తర్వాత ఆమె రాజకీయ ఎత్తుగడపై ఊహాగానాలు జోరందుకున్నాయి. అంతకుముందు గతేడాది నవంబర్‌లో కూడా సుబ్రమణ్యస్వామి టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీని కలిశారు. ఇరువురు నేతల సమావేశం ఢిల్లీలో జరిగింది.

సమావేశం అనంతరం స్వామి ట్వీట్ చేస్తూ, "నేను కలిసిన లేదా పనిచేసిన రాజకీయ నాయకులందరిలో, JP (జయప్రకాష్ నారాయణ్), మొరార్జీ దేశాయ్, రాజీవ్ గాంధీ, చంద్రశేఖర్, PV నరసింహారావు నుండి మమతా బెనర్జీ వ‌ర‌కు. ఈ నేతల మాటలు, చేష్టలు చాలా భిన్నంగా ఉంటాయి. భారత రాజకీయాల్లో ఇదో అరుదైన లక్షణం. అని పేర్కొన్నారు.

గ‌తంలో ఆఫీస్‌ బేరర్లను నియమించేందుకు బీజేపీ సంస్థాగత ఎన్నికలను దూరం పెట్టిందన్న సుబ్రమణ్యస్వామి .. ప్రధాని మోదీ ఆమోదంతోనే సభ్యులంతా నామినేట్‌ అవుతున్నారని ఆరోపించారు. ఆఫీస్‌ బేరర్ల నియామకాలన్నీ పార్టీలో ఎన్నికల ద్వారానే జరిగేవని సుబ్రమణ్యస్వామి గుర్తుచేశారు.