కీచక పోలీసు.. నాలుగేళ్ల దళిత బాలికపై సబ్ ఇన్ స్పెక్టర్ అత్యాచారం.. పోలీసుల స్టేషన్ ఎదుట స్థానికుల ఆందోళన
నాలుగేళ్ల చిన్నారిపై ఓ ఎస్ఐ దారుణానికి ఒడిగట్టాడు. తన గదికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం స్థానికులకు తెలియడంతో ఆందోళన చేపట్టారు. పోలీసు స్టేషన్ ను ముట్టడించారు. దీంతో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు.
రాజస్థాన్ లో దారుణం జరిగింది. నాలుగేళ్ల చిన్నారిపై ఓ సబ్ ఇన్సెక్టర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. దౌసా జిల్లాలో ఈ ఘటన జరిగింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. నిందితుడైన సబ్ ఇన్స్పెక్టర్ ను అరెస్టు చేశారు. అరెస్టు సమయంలో పోలీసు స్టేషన్ దగ్గర గందరగోళ వాతావరణం నెలకొంది.
కేసీఆర్‌ను విమర్శించే అర్హత సిద్ధరామయ్యకు లేదు.. కాంగ్రెస్ పై ఎమ్మెల్సీ కవిత ఘాటు వ్యాఖ్యలు
ఏఎస్పీ రామచంద్ర సింగ్ నెహ్రా ‘పీటీఐ’తో తెలిపిన వివరాల ప్రకారం.. దౌసా జిల్లాలోని లాల్సోట్ నాలుగేళ్ల చిన్నారి తన తల్లిదండ్రులతో కలిసి జీవిస్తోంది. అయితే ఆ ప్రాంతానికి చెందిన సబ్ ఇన్స్పెక్టర్ భూపేంద్ర సింగ్.. మధ్యాహ్నం సమయంలో ఆ బాలికను తన గదిలోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం బయటకు రావడంతో స్థానికులు ఆ ఎస్ఐపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
స్థానికులు పెద్ద ఎత్తున రాహువాస్ పోలీస్ స్టేషన్ ను ముట్టడించారు. పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో నిందితుడిని అరెస్టు చేస్తామని హామీ ఇచ్చారు. అయితే ఈ అరెస్టుకు ముందే అతడిని స్థానికులు చితకబాదారు. కాగా.. బీజేపీ ఎంపీ కిరోడి లాల్ మీనా కూడా సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
అయ్యప్ప భక్తులకు గుడ్‌న్యూస్.. శబరిమల వివరాలు అందించే మొబైల్ యాప్‌ను ఆవిష్కరించిన ప్రభుత్వం
చిన్నారికి న్యాయం చేసేందుకే తాను ఇక్కడికి చేరుకున్నానని ఎంపీ కిరోడి లాల్ మీనా చెప్పారు. అశోక్ గెహ్లాట్ ప్రభుత్వ అసమర్థత కారణంగా పోలీసులు నిరంకుశంగా మారిపోయారని ఆరోపించారు. ఎన్నికలు వంటి సున్నితమైన సందర్భంలో కూడా పోలీసులు దౌర్జన్యాలకు పాల్పడటం మానడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
నిందితుడైన ఏఎస్ఐ భూపేంద్ర సింగ్ పై కఠిన చర్యలు తీసుకుంటున్నామని, త్వరలోనే అతడిని ఉద్యోగం నుంచి తొలగిస్తామని హామీ ఇచ్చారు. బాధిత కుటుంబానికి పోలీసులు అన్ని విధాలుగా సహకరిస్తారని తెలిపారు. బాధితురాలి కుటుంబానికి నష్టపరిహారం చెల్లిస్తామని ఎంపీ చెప్పారు.