తమ ఊరు దగ్గరపడుతున్న సమయంలో వారు డ్రైవర్ దగ్గరకు వెళ్లి.. ఊరు రాగానే బస్సు ఆపాల్సిందిగా కోరారు. అయితే డ్రైవర్ అందుకు ఒప్పుకోలేదు. బస్సు ఆ ఊరు మీద నుంచి వెళ్లదని చెప్పాడు.
యువకులు చేస్తున్న టీజింగ్ తట్టుకోలేక ఇద్దరు కాలేజీ విద్యార్థినులు రన్నింగ్ బస్ లో నుంచి కిందకు దూకేశారు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ లోని బులందర్ షహర్ లో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
రన్‌హెరా గ్రామానికి చెందిన ఇద్దరు ఇంటర్ విద్యార్ధినులు సొంత గ్రామానికి వెళ్లటానికి గురువారం పది గంటల ప్రాంతంలో ఓ ప్రైవేట్ బస్సు ఎక్కారు. బస్సు ముందు సీట్లలో యువకులు కూర్చుని ఉండటంతో వారి వెనకాల సీట్లలో యువతులు కూర్చున్నారు. తమ ఊరు దగ్గరపడుతున్న సమయంలో వారు డ్రైవర్ దగ్గరకు వెళ్లి.. ఊరు రాగానే బస్సు ఆపాల్సిందిగా కోరారు. అయితే డ్రైవర్ అందుకు ఒప్పుకోలేదు. బస్సు ఆ ఊరు మీద నుంచి వెళ్లదని చెప్పాడు.
దానికి తోడు ముందు సీట్లలో కూర్చుని ఉన్న యువకులు ‘‘ఈ రోజు బస్సు మీ ఊర్లో ఆగదు. ఇక చూడు! భలే సరదా ఉంటుంది’’ అనటం ప్రారంభించారు. దీంతో భయాందోళనకు గురైన యువతులు మరోసారి డ్రైవర్‌ను ప్రాథేయపడుతున్నట్లు అడిగారు. అతడు ఒప్పుకోలేదు. ఆ యువకులు కేకలు వేయటం మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో ఆ ఇద్దరు విద్యార్ధినులు ఒకరి తర్వాత ఒకరు బస్సులోనుంచి కిందకు దూకేశారు. ఇద్దరికీ తీవ్రంగా గాయాలయ్యాయి. బాధిత యువతుల కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు బస్సు డ్రైవర్‌పై కేసు నమోదైంది. అయితే డ్రైవర్ సదరు యువతుల కుటుంబాలతో రాజీ పడటంతో గొడవ సద్దుమణిగింది.
Read Exclusive COVID-19 Coronavirus News updates, from Telangana, India and World at Asianet News Telugu.
వర్చువల్ బోట్ రేసింగ్ గేమ్ ఆడండి మిమ్మల్ని మీరు ఛాలెంజ్ చేసుకోండి ఇప్పుడే ఆడటానికి క్లిక్ చేయండి
Last Updated Jan 8, 2021, 12:48 PM IST