Asianet News TeluguAsianet News Telugu

సీఎంపైకి చెప్పు విసిరిన యువకుడు.. అరెస్ట్

చెప్పు విసిరిన వ్యక్తిని ఔరంగాబాద్‌కు చెందిన చందన్ కుమార్‌గా పోలీసలు గుర్తించారు. రాష్ట్రంలో రిజర్వేషన్లపై అసంతృప్తిగా ఉన్న చందన్.. ఈ పనికి పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. 

Student throws sandal at Bihar CM Nitish Kumar
Author
Hyderabad, First Published Oct 11, 2018, 3:52 PM IST

బిహార్ సీఎం నితీశ్ కుమార్  పైకి చెప్పు విసిరిన యువకుడిని  పోలీసులు అరెస్ట్ చేశారు. గురువారం ఉదయం జనతాదళ్ యునైటెడ్ యూత్ వింగ్  ఏర్పాటు చేసిన సమాశానికి సీఎం నితీష్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతుండగా.. ఓ యువకుడు ఆయనపైకి చెప్పు విసిరాడు. 

చెప్పు విసిరిన వ్యక్తిని ఔరంగాబాద్‌కు చెందిన చందన్ కుమార్‌గా పోలీసలు గుర్తించారు. రాష్ట్రంలో రిజర్వేషన్లపై అసంతృప్తిగా ఉన్న చందన్.. ఈ పనికి పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. తాను అగ్ర కులానికి చెందిన వ్యక్తి కావడం, రిజర్వేషన్ వ్యవస్థ కారణంగా ఉద్యోగం లభించకపోవడంతో తన అసంతృప్తిని ఇలా వెల్లగక్కినట్లు చందన్ పోలీసుల విచారణలో వెల్లడించాడు.

చందన్‌ నితీష్‌పైకి చెప్పు విసిరిన వెంటనే జేడీయూ యూత్ కార్యకర్తలు అతనిపై దాడి చేశారు. పోలీసులు వచ్చి చందన్‌ను విడిపించి అక్కడ నుంచి తీసుకెళ్లారు. ఈ సమయంలో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్.. నితీష్ పక్కనే ఉన్నారు. సీఎం నితీష్‌ కుమార్‌పైకి చెప్పు విసరడం ఇదే తొలిసారి కాదు. గతంలో 2016లోనూ పీకే రాయ్ అనే వ్యక్తి నితీష్‌పైకి చెప్పు విసిరాడు.

Follow Us:
Download App:
  • android
  • ios