న్యూఢిల్లీ:  ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శుక్రవారం నాడు లైట్ హౌస్ ప్రాజెక్టు ఇళ్లకు శంకుస్థాపన చేశారు.  గ్లోబల్ హౌసింగ్ టెక్నాలజీ చాలెంజ్ ఇండియా కింద ఈ ఇళ్లను నిర్మించనున్నారు.

వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మోడీ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అధికారులు పాల్గొన్నారు. 

ఈ ఆరు ప్రాజెక్టులు దేశంలో ఆరు రాష్ట్రాల్లో ఈ పథకం కింద ఇళ్లను నిర్మిస్తున్నట్టుగా ఆయన చెప్పారు. ఇది సహకార సమాఖ్యవాదాన్ని కూడ బలపరుస్తుందని చెప్పారు. 

గత ప్రభుత్వాలు గృహ నిర్మాణ ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇవ్వలేదన్నారు. గృహ నిర్మాణ మౌలిక సదుపాయాల నాణ్యతపై ప్రభుత్వాలు ఆందోళన చెందలేదన్నారు.

హౌసింగ్ విధానంపై తమ ప్రభుత్వం విధానాన్ని మార్చుకొందని చెప్పారు. జీహెచ్‌టీసీ ఇండియా చాలెంజ్ గురించి ఆయన వివరించారు. టెక్నాలజీపై పనిచేస్తున్న 50కి పైగా కంపెనీలు ఇందులో పాల్గొన్నాయన్నారు.

అగర్తలా, లక్నో, ఇండోర్,రాజ్ కోట్, చెన్నై, రాంచీలలో ఇళ్ల నిర్మాణాల్లో ఉపయోగించే టెక్నాలజీ గురించి ఆయన ప్రసంగించారు.అమెరికా, ఫిన్లాండ్ నుండి లలో ఉపయోగిస్తున్న ఫ్రీకాస్ట్ కాంక్రీట్ పద్దతిలో చెన్నైలో ఇళ్లను నిర్మించనున్నట్టుగా మోడీ ప్రకటించారు.

రాంచీలో మాత్రం జర్మనీలో ఉపయోగించే త్రీడీ నిర్మాణ పద్దతులను ఉపయోగించనున్నారని ఆయన చెప్పారు. న్యూజిలాండ్ స్టీల్ ఫ్రేమ్ టెక్నాలజీని అగర్తలలో ఉపయోగించనున్నారని మోడీ తెలిపారు. లక్నోలో కెనడా టెక్నాలజీని ఉపయోగిస్తారు.