కర్ణాటకలోని శివమొగ్గ జిల్లాలో ప్రభుత్వ ఆసుపత్రిలోని ప్రసూతి వార్డు సమీపంలో ఓ కుక్క నవజాత శిశువు మృతదేహాన్ని ఈడ్చుకెళ్లింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
కర్ణాటక : కర్ణాటకలోని శివమొగ్గ జిల్లాలో హృదయవిదారక ఘటన చోటు చేసుకుంది. ఓ ప్రభుత్వ ఆసుపత్రిలోని ప్రసూతి వార్డు సమీపంలో శనివారం నవజాత శిశువు మృతదేహాన్ని కుక్క ఈడ్చుకెళ్లిన ఘటన షాకింగ్ గురి చేసింది. శనివారం జరిగిన ఈ ఘటనలో కుక్కను తరిమికొట్టి చిన్నారిని వైద్యపరీక్షలు చేయగా అప్పటికే మృతి చెందినట్లు తేలింది. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెడితే..
శనివారం ఉదయం 7 గంటల ప్రాంతంలో నవజాత శిశువును నోట కరుచుకుని ఓ కుక్క ఆసుపత్రి ప్రసూతి వార్డు చుట్టూ పరిగెత్తడాన్ని సిబ్బంది, ఆస్పత్రికి వచ్చినవారు గమనించారు. వెంటనే వారు కుక్కకు తరిమికొట్టినట్లు మెక్‌గాన్ జిల్లా ఆసుపత్రిలోని సెక్యూరిటీ గార్డులు తెలిపారు. కుక్క నోట్లోని చిన్నారిని వైద్య పరీక్షలకు తీసుకువెళ్లేలోపే మృతి చెందింది. ఈ సంఘటన నగరంలో వీధికుక్కల బెడదకు అద్దం పడుతోంది.
తెలంగాణ హై కోర్టు తొలి సీజే జస్టిస్ టీబీ రాధా కృష్ణన్ ఇకలేరు..
కుక్క కరవడానికి ముందే నవజాత శిశువు చనిపోయాడా లేదా కుక్క నోట్లో పెట్టుకుని చక్కర్లు కొట్టడం వల్ల చనిపోయాడా అనే దానిపై అధికారులు ఇప్పుడు ఆరా తీస్తున్నారు. ఆ చిన్నారి తల్లిదండ్రులెవరో ఇంకా తెలియరాలేదు. దీనిమీద పోలీసులకు ఫిర్యాదు చేశామని, పోస్టుమార్టం తర్వాతే శిశువు మృతికి సంబంధించిన ఖచ్చితమైన వివరాలు తెలియనున్నాయని వర్గాలు చెబుతున్నాయి. మృతశిశువు వివరాల కోసం గర్భిణుల రికార్డులను చూసేందుకు అధికారులు సమీపంలోని అన్ని ప్రైవేట్, ప్రభుత్వ ఆసుపత్రులను తనిఖీ చేస్తున్నారు.
ఇదిలా ఉండగా, మార్చి 1న జైపూర్ లో ఇలాంటి ఘటనే వెలుగుచూసింది. రాజస్థాన్‌లోని సిరోహి జిల్లాలోని ఓ ఆసుపత్రిలో ఓ పసికందును వీధికుక్కలు తీసుకెళ్లి కరిచి చంపాయి. ఆస్పత్రిలోని టీబీ వార్డులో నెల వయసున్న చిన్నారి తన తల్లి పక్కనే నిద్రిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఆ రోజు అర్థరాత్రి రెండు కుక్కలు ఆస్పత్రిలోని టీబీ వార్డులోకి వెళ్లాయని, వాటిలో ఒకటి పసిపాపతో తిరిగి వచ్చినట్లు సీసీటీవీ ఫుటేజీలో తేలిందని పోలీసులు తెలిపారు. చిన్నారి తండ్రి క్షయ చికిత్స కోసం ఆస్పత్రిలో చేరినట్లు ఎస్‌హెచ్‌ఓ కొత్వాలి సీతారాం తెలిపారు. తన ఇతర పిల్లలతో పాటు రోగికి చికిత్స చేస్తున్న చిన్నారి తల్లి గాఢనిద్రలో ఉండగా ఈ ఘటన జరిగిందని ఆయన చెప్పారు.
ఘటన జరిగిన సమయంలో ఆస్పత్రి సిబ్బంది కూడా టీబీ వార్డులో లేరని అధికారి తెలిపారు. "మెడికల్ బోర్డు ద్వారా పోస్ట్ మార్టం నిర్వహించబడింది. తదుపరి విచారణ తర్వాత ఈ విషయంలో కేసు నమోదు చేయబడుతుంది," అని ఎస్‌హెచ్‌ఓ తెలిపారు. మరోవైపు ఆసుపత్రి యాజమాన్యం కూడా దీనిపై విచారణ ప్రారంభించింది. "రోగి అటెండర్ నిద్రపోతున్నారు. ఆసుపత్రి గార్డు ఇతర వార్డులో ఉన్నాడు. సంఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని నేను చూడలేదు. విచారణ తర్వాత మాత్రమే నేను దీనిమీద మాట్లాడగలను" అని యాక్టింగ్ ప్రిన్సిపల్ మెడికల్ ఆఫీసర్ సిరోహి జిల్లా ఆసుపత్రి, వీరేంద్ర విలేకరులతో అన్నారు.
తన భార్య తనకు తెలియజేయకుండా ఖాళీ కాగితాలపై సంతకం చేసి, తన బిడ్డకు అంత్యక్రియలు నిర్వహించేలా ఆసుపత్రి అధికారులు, పోలీసులు బలవంతం చేశారని చిన్నారి తండ్రి ఆరోపించాడు "ఓ రోజు నన్ను ఆసుపత్రిలో చేర్చారు, వార్డులోకి కుక్కలు రావడంతో నేను వాటిని తరిమివేసాను, నా భార్య తెల్లవారుజామున 2 గంటలకు నిద్రలేచి, కుక్కలు మా బిడ్డను కరుస్తుండడం చూసింది. తెల్లారి, ఆసుపత్రి అధికారులు, పోలీసులు ఖాళీ కాగితాలపై నా భార్య సంతకం తీసుకున్నారు. నాకు సమాచారం ఇవ్వకుండానే నా కొడుకు అంత్యక్రియలు చేయించారు. నేను నా కొడుకు ముఖం కూడా చూడలేకపోయాను" అని మీనా చెప్పారు.
ఆసుపత్రి యాజమాన్యం కూడా ఈ విషయంపై విచారణ ప్రారంభించింది.ఈ ఘటనను ఖండిస్తూ బీజేపీ జిల్లా అధ్యక్షుడు నారాయణ్ పురోహిత్ మాట్లాడుతూ ఈ దుర్ఘటనకు ఆస్పత్రి అధికారులే బాధ్యత వహించాలన్నారు. ఇది పూర్తిగా ఆసుపత్రి పాలకవర్గం వైఫల్యమని, ఆసుపత్రిలో వీధికుక్కలు సంచరిస్తున్నాయని, అయితే ముఖ్యమంత్రి, స్థానిక ఎమ్మెల్యేలు రాష్ట్రంలో వైద్య సదుపాయాల రూపురేఖలను మార్చేశారని ఆయన అన్నారు.
