రాంచీ:రెడ్‌జోన్ లో పురిటి నొప్పులతో బాధపడుతున్న గర్భిణీని ఆసుపత్రికి తీసుకెళ్లకుండా పోలీసులు అడ్డుపడ్డారు. దీంతో ఆమె ఇంట్లోనే శిశువుకు జన్మనిచ్చింది. అయితే పుట్టిన కొద్దిసేపటికి ఆ చిన్నారి మృత్యువాత పడ్డాడు. పోలీసుల కారణంగానే తన కొడుకు మృతి చెందాడని మృతుడి తండ్రి ఆరోపించారు.ఈ ఘటన జార్ఖండ్ రాష్ట్రంలో చోటు చేసుకొంది.

రాంచీలోని హింద్బిరిలో అత్యధిక కరోనా కేసులతో రెడ్ జోన్‌ పరిధిలో ఉంది. ఈ ప్రాంతానికి చెందిన గర్భిణీ ఆదివారం నాడు రాత్రి 11 గంటలకు పురిటి నొప్పులు వచ్చాయి. దీంతో ఆమె భర్త ఇంతియాజ్, మిత్రుడి సహాయంతో ఆమెను తీసుకొని ఆసుపత్రికి బయలుదేరాడు. దీంతో పోలీసులు ఈ కారును ఆపారు. 

also read:వైద్యులపై దాడి చేస్తే భారీగా జరిమానా, జైలు శిక్ష: కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం

పురుటినొప్పులతో బాధపడుతున్న మహిళను ఆసుపత్రికి తీసుకెళ్తున్నట్టుగా వారు పోలీసులకు చెప్పారు. రెడ్ జోన్ ప్రాంతం నుండి ఇతర ప్రాంతానికి వెళ్లకూడదని పోలీసులు వారిని నిలిపారు. ఎంత బతిలాడినా కూడ పోలీసులు ఒప్పుకోలేదు. దీంతో తిరిగి ఇంటికి వచ్చారు. పక్కింటి వారి సహాయంతో ఆ మహిళకు ప్రసవం చేశారు.

అయితే పండంటి మగపిల్లాడికి ఆ మహిళ జన్మనిచ్చింది. పుట్టిన కొద్దిసేపటికి ఆ పిల్లాు మృతి చెందాడు. పుట్టిన కొద్దిసేపటికే ఆ చిన్నారి మృతి చెందడంతో ఆ కుటుంబ కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది.

మరో మార్గం గుండా వెళ్లాలని సూచించినా కూడ పట్టించుకోకుండా ఇంటికి వెళ్లారని పోలీసులు చెబుతున్నారు.ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.