సెలబ్రెటీల గురించి తెలుసుకోవాలని ప్రతి ఒక్కరూ ఇంట్రెస్ట్ చూపిస్తారు. వాళ్లు ఏం చేస్తున్నారు..? ఎక్కడ ఉన్నారు..? ఏం తిన్నారు..? ఏ డ్రెస్ వేసుకున్నారు.. ఇలా వారి గురించి ఏ విషయమైనా ఇట్టే సోషల్ మీడియాలో వైరల్ అయిపోతోంది. ఇక ఫోటోగ్రాఫర్లు సైతం వాళ్లు ఎక్కడ కనిపించినా.. ఏ పరిస్థితుల్లో ఉన్నారనే విషయం కూడా పట్టించుకోకుండా.. కెమేరాలతో క్లిక్ మనిపిస్తారు.

 ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసేస్తుంటారు. వాటిని చూసి మనమంతా సంబరపడతాం. కానీ.. సదరు సెలబ్రెటీలు ఇబ్బంది పడతారని.. వాళ్లకి కూడా కొంచెం ప్రైవసీ కావాలని కోరుకుంటారన్న విషయం మనం గుర్తించాలంటున్నారు బాలీవుడ్ బ్యూటీ, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సతీమణి అనుష్క శర్మ.

 ఇంతకీ విషయం ఏంటంటే.. ముంబై జూహు నివాసంలోని బాల్కనిలో కోహ్లీ, అనుష్క దంపతులు కూర్చొని ప్రశాంతగా అల్పహారం తీసుకుంటున్నారు. ఈ పోస్ట్ ని అనుష్క శర్మ తన ఇన్ స్టా గ్రామ్ స్టోరీస్ లో పోస్ట్ చేసింది. అయితే ఈ విషయంలోనే అనుష్క శర్మ సీరియస్ గా ఉంది. ఎందుకంటే.. అనుష్క పోస్ట్ చేసిన ఫోటోను విరుష్క దంపతుల అనుమతి లేకుండా తీసి ఓ ఫోటోగ్రాఫర్ తమ పబ్లికేషన్స్ లో ఉపయోగించుకున్నారు.

ఆ ఫోటో గ్రాఫర్, పబ్లికేషన్స్ పై అనుష్క శర్మ సీరియస్ అయింది. మేము మనుషులమే.. మాకు ప్రైవసీ ఉంటుందని.. ఎటువంటి అనుమతులు లేకుండా ఫోటోలు తీయడం సమంజసం కాదని అనుష్క శర్మ ఫైర్ అయింది. ఇలాంటి పనులు మానేస్తే మంచిదని సూచించింది. ఇదిలా ఉండగా.. ఈ నెలలోనే అనుష్క తన బిడ్డకు జన్మనివ్వబోతోంది. ఇందుకోసం పితృత్వపు సెలవుల మీద విరాట్ కోహ్లీ ఆస్ట్రేలియా నుంచి భారత్ కు తిరిగొచ్చాడు.