Asianet News TeluguAsianet News Telugu

సుప్రీంకి రాజస్థాన్ స్పీకర్: సచిన్ వర్గం పిటిషన్‌పై తీర్పు ఇవ్వొద్దని పిటిషన్

అనర్హత నోటీసులపై హైకోర్టు ఎలాంటి తీర్పు ఇవ్వకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ సుప్రీంకోర్టులో రాజస్థాన్ స్పీకర్ జోషీ బుధవారం  నాడు  సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు.
 

Stop High Court Hearing, Rajasthan Speaker Asks Supreme Court
Author
Jaipur, First Published Jul 22, 2020, 1:30 PM IST


జైపూర్:అనర్హత నోటీసులపై హైకోర్టు ఎలాంటి తీర్పు ఇవ్వకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ సుప్రీంకోర్టులో రాజస్థాన్ స్పీకర్ జోషీ బుధవారం  నాడు  సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు.

రాజస్థాన్ రాజకీయాలు రోజు రోజుకు మారిపోతున్నాయి. సచిన్ పైలెట్ సహా 18 మంది మంది ఎమ్మెల్యేలపై ఈ నెల 24వ తేదీ వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని రాజస్థాన్ హైకోర్టు ఈ నెల 21న ఆదేశించింది. అంతేకాదు ఈ నెల 24వ తేదీన ఈ విషయమై తీర్పును వెల్లడించనున్నట్టుగా హైకోర్టు ప్రకటించింది. దీంతో ఈ ఆదేశాలను నిలిపివేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో జోషీ పిటిషన్ దాఖలు చేశాడు.

also read:ఫెర్టిలైజర్ స్కామ్‌పై బీజేపీ ఆరోపణలు:ఆశోక్ గెహ్లాట్ సోదరుడి సంస్థలపై ఈడీ సోదాలు

పార్టీ ఆదేశాలకు వ్యతిరేకంగా వ్యవహరించారని ప్రభుత్వ చీఫ్ విఫ్ స్పీకర్ కు సచిన్ పైలెట్  సహా 18 మంది ఎమ్మెల్యేలపై ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులపై స్పీకర్ సీపీ జోషీ అసమ్మతి ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసులపై హైకోర్టును ఆశ్రయించారు సచిన్ వర్గం.

పార్టీ ఫిరాయింపులపై తుది నిర్ణయం తీసుకోవాల్సింది స్పీకర్ మాత్రమేనని జోషీ అభిప్రాయపడ్డారు. ఈ మేరకు గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను ఆయన గుర్తు చేశారు. దీనిపై ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చే అధికారం తనకు ఉందన్నారు. అనర్హతపై స్పీకర్ నిర్ణయం తీసుకొన్న తర్వాతే  న్యాయ సమీక్షకు అవకాశం ఉంటుందని ఆయన ఇవాళ మీడియాకు చెప్పారు.

Follow Us:
Download App:
  • android
  • ios